సోమవారం 30 నవంబర్ 2020
National - Oct 28, 2020 , 14:04:35

సుప్రీంకోర్టులో రేవంత్ రెడ్డికి ఎదురుదెబ్బ‌

సుప్రీంకోర్టులో రేవంత్ రెడ్డికి ఎదురుదెబ్బ‌

న్యూఢిల్లీ : ‌తెలంగాణ స‌చివాల‌యం కూల్చివేత, నిర్మాణంపై మ‌ల్కాజ్‌గిరి కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి దాఖ‌లు చేసిన పిటిష‌న్‌ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. స‌చివాల‌యం కూల్చివేత‌, నిర్మాణానికి అనుమ‌తి ఇస్తూ హైకోర్టు ఇచ్చిన ఆదేశాల‌పై స్టే ఇవ్వాల‌ని రేవంత్ రెడ్డి పిటిష‌న్ దాఖ‌లు చేశారు. హైకోర్టులో దాఖ‌లైన పిటిష‌న్‌లో మీరు పార్టీగా లేర‌ని పిటిష‌న‌ర్‌ను జ‌స్టిస్ అశోక్ భూష‌ణ్ ధ‌ర్మాస‌నం ప్ర‌శ్నించింది. ఈ నేప‌థ్యంలో పిటిష‌న్‌ను విచారించేందుకు సుప్రీంకోర్టు నిరాక‌రించింది. తాము నేష‌న‌ల్ గ్రీన్ ట్రిబ్యున‌ల్‌(ఎన్జీటీ)లో దాఖ‌లు చేసిన పిటిష‌న్‌పై హైకోర్టు తీర్పు ప్ర‌భావం ప‌డింద‌ని పిటిష‌న‌ర్ త‌ర‌పు న్యాయ‌వాది రాజ్ పంజ్వాని కోర్టుకు తెలిపారు. ఎన్జీటీలో లేవ‌నెత్తిన అంశాల‌కు హైకోర్టు తీర్పు అడ్డురాద‌ని సుప్రీంకోర్టు పేర్కొంది. కూల్చివేత‌కు ప‌ర్యావ‌ర‌ణ అనుమ‌తులు అవ‌స‌రమా, లేదా అన్న అంశం ఎన్జీటీ ప‌రిశీలించ‌వ‌చ్చు అని కోర్టు తెలిపింది.