Results : జాయింట్ సీఎస్ఐఆర్-యూజీసీ నెట్ (CSIR-UGC-NET) డిసెంబర్-2023 ఫలితాలు విడుదలయ్యాయి. ఇవాళ (ఆదివారం) ‘నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA)’ ఫలితాలను విడుదల చేసింది. అభ్యర్థులు తమ అప్లికేషన్ నంబర్, పుట్టిన తేదీ వివరాలతో అధికారిక వెబ్సైట్లో ఫలితాలను చూసుకోవచ్చు.
కాగా, డిసెంబర్ 26, 27, 28 తేదీల్లో దేశవ్యాప్తంగా మొత్తం 356 కేంద్రాల్లో జాయింట్ సీఎస్ఐఆర్-యూజీసీ నెట్ పరీక్ష జరిగింది. మొత్తం 2,19,146 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా 1,75,355 మంది హాజరయ్యారు. సైన్స్ సబ్జెక్టుల్లో పరిశోధనలకు అవకాశం కల్పించే జేఆర్‌ఎఫ్‌తోపాటు లెక్చరర్‌షిప్/ అసిస్టెంట్ ప్రొఫెసర్ అర్హతల కోసం ఎన్టీఏ ఈ పరీక్షను నిర్వహిస్తోంది.
ఈ పరీక్ష ద్వారా జేఆర్ఎఫ్కు అర్హత పొందితే సీఎస్ఐఆర్ పరిధిలోని రిసెర్చ్ సెంటర్లు, విశ్వవిద్యాలయాల్లో పీహెచ్‌డీకి దరఖాస్తు చేసుకోవచ్చు. లెక్చరర్‌షిప్‌కు అర్హత పొందితే విశ్వవిద్యాలయాలు లేదా డిగ్రీ కళాశాలల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా పనిచేసే అవకాశం లభిస్తుంది.
ఫలితాలు ఎలా చూసుకోవాలి..?
ముందుగా అధికారిక వెబ్సైట్ https://csirnet.nta.ac.in./ను సందర్శించాలి. హోమ్ పేజీలో ‘Joint CSIR-UGC NET DECEMBER-2023 Score Card Live’ అనే లింక్‌పై క్లిక్ చేయాలి. అప్లికేషన్ నంబర్, పుట్టిన తేదీ ఎంటర్ చేయాలి. మీ CSIR-UGC NET ఫలితాలు తెరపై కనిపిస్తాయి. అనంతరం స్కోర్‌కార్డును డౌన్లోడ్ చేసుకొని భద్రపర్చుకోవాలి.