ఉద్యోగానికి రాజీనామా చేయాలంటే ఎవరైనా రకరకాలుగా ఆలోచిస్తారు. అతి కష్టం మీదనే ఈ కఠిన నిర్ణయం తీసుకుంటారు. దానికి కారణాలను సవివరంగా రాసి రాజీనామా లేఖను బాస్ ముందు పెడతారు. అయితే ఒక వ్యక్తి మాత్రం సూటిగా తన సమస్యను రెండు ముక్కల్లో చెప్పేసి ఉద్యోగానికి రిజైన్ చేసేశాడు.
అది కూడా ప్రముఖ కంపెనీ ఆర్పీజీ ఎంటర్‌ప్రైజెస్‌లో. సదరు ఉద్యోగి రాసిని రిజిగ్నేషనల్ లెటర్‌ను ఫొటో తీసిన ఆ కంపెనీ చైర్మన్ హర్ష్ గోయెంకా సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ఇంతకీ ఆ లెటర్లో ఏముందో తెలుసా? ‘‘డియర్ హర్ష్, నేను రాజీనామా చేస్తున్నా. మజా రావడం లేదు’’ అని మాత్రమే ఉంది.
దాన్ని షేర్ చేసిన గోయెంకా.. ‘‘ఈ లెటర్ చిన్నగా ఉన్నా కూడా చాలా లోతుగా ఆలోచింపచేస్తుంది. ఇది చాలా పెద్ద సమస్య. మనందరం కలిసి సాల్వ్ చెయ్యాలి’’ అని పోస్ట్ చేశాడు. దీనిపై స్పందించిన మరికొందరు నెటిజన్లు నిజమేనంటూ కామెంట్లు పెట్టారు. నిజంగానే ఇది చాలా పెద్ద సమస్యేనని వాళ్లు అంటున్నారు.