న్యూఢిల్లీ: మూత్రాశయ క్యాన్సర్‌కు క్రోమోజోములే కారణమని పరిశోధకులు తేల్చారు. కాలిఫోర్నియాలోని సెడార్స్-సినాయ్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ డైరెక్టర్ డాన్ థియోడోరెస్కూ దీనిపై పరిశోధనలు చేశారు.
ఈ అధ్యయన ఫలితాన్ని జర్నల్ నేచర్‌లో ప్రచురించారు. వయసు పెరిగేకొద్దీ కణాల్లోని వై-క్రోమోజోములను పురుషులు కోల్పోతారని తెలిపారు. దీని ప్రభావంతో క్యాన్సర్‌పై పోరాడే సామర్థ్యాన్ని కోల్పోతారని, దీంతో మూత్రాశయ క్యాన్సర్ సంక్రమిస్తుందన్నారు.