న్యూఢిల్లీ, సెప్టెంబర్ 16 : కార్బన్ డయాక్సైడ్ కారణంగా వాతావరణంలో మార్పులు వస్తుండటంతో కాలుష్యరహిత ఇంధనాలపై ప్రభుత్వాలు, శాస్త్రవేత్తలు దృష్టి సారించారు. ప్లాస్టిక్ వ్యర్థాల నుంచి హైడ్రోజన్‌ను ఉత్పత్తి చేసినట్లు టెక్సాస్‌లోని రైస్ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు తాజాగా వెల్లడించారు.
ఈ ప్రక్రియలో ఉద్గారాలు తక్కువగా ఉండటం విశేషమని పరిశోధకులుతెలిపారు. ప్లాస్టిక్ వ్యర్థాలను ఉపయోగించి హై ఈల్డ్ హైడ్రోజన్ వాయువు, హై వ్యాల్యూ గ్రాఫీన్లను ఉత్పత్తి చేసినట్టు ఈ అధ్యయనానికి నేతృత్వం వహించిన కెవిన్ వీస్ తెలిపారు. ఈ అధ్యయన ఫలితాలు అడ్వాన్స్డ్ మెటీరియల్స్ జర్నల్‌లో ప్రచురితమయ్యాయి.