న్యూఢిల్లీ: దేశరాజధాని ఢిల్లీలో ఈనెల 26వ తేదీన జరగనున్న రిపబ్లిక్ డే పరేడ్(Republic Day Parade)ను వందేమాతరం థీమ్‌తో నిర్వహించనున్నారు. కర్తవ్యపథ్‌పై 150 ఏళ్ల వందేమాతరం శోభ వెల్లువిరియనున్నది. జాతీయ గీతానికి చెందిన ఆర్ట్‌వర్క్‌ను ప్రజెంట్ చేయనున్నారు. ఆ గేయాన్ని రాసిన బంకిమ్ చంద్ర ఛటర్జీకి ప్రత్యేక నివాళి అర్పించనున్నారు. గతంలో రిపబ్లిక్ డే పరేడ్‌ను వీక్షించే వారి కోసం వివిధ రకాల కేటగిరీలతో పాస్‌లను ఇచ్చేశారు. ఈ సారి కొత్త విధానాన్ని ప్రవేశపెడుతున్నారు. ప్రేక్షకుల గ్యాలరీకి భారతీయ నదులతో పేర్లు పెట్టారు. బియాస్, బ్రహ్మపుత్ర, చంబల్, చీనాబ్, గండక్, గంగా, ఘాగ్రా, గోదావరి, సిందు, జీలం, కావేరి, కోశి, కృష్ణ, మహానంది, నర్మద, పెన్నార్, పెరియార్, రావి, సోని, సట్లజ్, తీస్తా, వైగయి, యమునా నదుల పేర్లతో ప్రేక్షకుల గ్యాలరీలను పిలవనున్నారు.
ఇక జనవరి 29వ తేదీన జరగనున్న బీటింగ్ రిట్రీట్ సెర్మనీ కోసం భారతీయ సంగీత వాద్యాల పేర్లతో ఎన్క్లోజర్లను పిలువనున్నారు. బాన్సురి, డమరుకం, ఎక్తారా, ఇస్రాజ్, మృదంగం, నగడా, పక్వాజ్, సంతూర్, సారంగి, సరింద, సరోద్, షెహనాయి, సితార్, సుర్బహార్, తబల, వీణా పేర్లతో పిలవనున్నారు. యురోపియన్ కమీషన్ ప్రెసిడెంట్ ఉరుసుల వాన్ డేర్ లియాన్, యురోపియన్ కౌన్సిల్ ప్రెసిడెంట్ ఆంటోనియో కోస్టా.. పరేడ్‌కు చీఫ్ గెస్ట్‌గా హాజరుకానున్నారు. ఈసారి పరేడ్‌లో 30 శకటాలను ప్రదర్శిస్తున్నారు. వివిధ రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు చెందిన 17 శకటాలు ప్రదర్శనకు ఉంటాయని, 13 శకటాలు మాత్రం మంత్రిత్వశాఖలు, సర్వీస్‌లకు ఉండనున్నట్లు రక్షణశాఖ కార్యదర్శి ఆర్కే సింగ్ తెలిపారు.