న్యూఢిల్లీ : డెల్టా, ఒమిక్రాన్ కలయికతో పుట్టుకొచ్చిన కొవిడ్ న్యూ స్ట్రెయిన్ డెల్టాక్రాన్స్ ప్రమాదకర స్ట్రెయిన్ అని తాజా రిపోర్ట్ వెల్లడించింది. డెల్ట్రాక్రాన్లు పలు ప్రాంతాలకు వ్యాపించడంతో పాటు ఇవి డెల్టా తరహాలో లంగ్స్పై దాడి చేస్తాయని, ఒమిక్రాన్ తరహాలో సులభంగా వ్యాప్తి చెందుతాయని ఈ రిపోర్ట్ హెచ్చరించింది.
భారత్‌లో ప్రస్తుతం డెల్టాక్రాన్ కేసులు నమోదు కాలేదు. జనవరిలో డెల్టాక్రాన్ కేసు వెలుగుచూసినా ప్రస్తుతం ఆ స్ట్రెయిన్ ఎక్స్బీసీ, ఎక్స్ఏవై, ఎక్స్ఏడబ్ల్యూ వంటి నూతన కొవిడ్ వేరియంట్స్‌గా ముందుకొచ్చాయి. ఈ స్ట్రెయిన్ డెల్టా వేరియంట్ అంతటి ప్రమాదకరమని, ఒమిక్రాన్ తరహాలో వేగంగా వ్యాప్తి చెందుతుందని ఫార్చూన్ వెల్ పేర్కొంది.
డెల్టా, ఒమిక్రాన్‌ల కాంబినేషన్‌తో కూడిన ఎక్స్బీసీ ఫిలిప్పీన్స్ వంటి ఆసియా దేశాల్లో వ్యాప్తి చెందుతోందని ఇది విశృంఖలంగా వ్యాప్తి చెందే సామర్ధ్యం కలిగిఉన్నదని నేచర్ రివ్యూస్ ఇమ్యునాలజీలో ప్రచురితమైన అధ్యయనం వెల్లడించింది.