న్యూఢిల్లీ: బియ్యం ఎగుమతులపై ఆంక్షలను తొలగిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. బాస్మతియేతర తెల్ల బియ్యంపై ఉన్న కనీస ఎగుమతి ధర (టన్నుకు 490 డాలర్లు)ను తొలగిస్తున్నట్టు తెలిపింది. పారా బాయిల్డ్ రైస్ (ఉప్పుడు బియ్యం), బ్రౌన్ రైస్లకు ఎగుమతి సుంకాన్ని కూడా కేంద్రం తొలగించింది. అంతకుముందు వీటిపై 10% ఎగుమతి సుంకం ఉండేది. ఈ తగ్గింపు ఈ నెల 22 నుంచి అమలులోకి వస్తుంది. గత నెలలో ప్రభుత్వం బాస్మతియేతర బియ్యంపై ఎగుమతి సుంకాన్ని మినహాయించిన సంగతి తెలిసిందే. అలాగే పారాబాయిల్డ్, బ్రౌన్, వరిబియ్యం లెవీని 20 నుంచి 10 శాతానికి తగ్గించడమే కాక, బాస్మతి బియ్యం కనీస ఎగుమతి ధర ను కూడా కేంద్రం రద్దు చేసింది.