న్యూఢిల్లీ: నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్(ఎన్సీఈఆర్టీ) కొత్తగా విడుదల చేసిన తొమ్మిదో తరగతి సాంఘిక శాస్త్రం పాఠ్య పుస్తకంలో కీలక మార్పులు చేసింది. గత పుస్తకాల్లోని రాజ్యాంగ ప్రవేశిక(పీఠిక)తో పాటు సెక్యులర్(లౌకిక), సెక్యులరిజం (లౌకికవాదం) అనే పదాలకు సంబంధించిన ప్రస్తావనలను నూతన ఎడిషన్ నుంచి తొలగించింది.సవరించిన పాఠ్య పుస్తక మార్పులపై ప్రతిపక్షాలు కూడా పలు ప్రశ్నలు గుప్పిస్తున్నాయి.
8వ తరగతి పుస్తకంలో న్యాయవ్యవస్థను కించపరిచేలా పాఠం ఉందంటూ గతంలో వివాదాస్పదమైన దరిమిలా తాజాగా విడుదలైన 9వ తరగతి పుస్తకంలో న్యాయ వ్యవస్థను ‘ఒక నిష్పాక్షికమైన, స్వతంత్ర సంస్థ’గా అభివర్ణించారు.