రిలయన్స్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో వేయి ఆక్సిజన్ పడకలతో కొవిడ్ సెంటర్లు!

అహ్మదాబాద్ : గుజరాత్ లోని జామ్ నగర్ లో రిలయన్స్ ఫౌండేషన్ వేయి ఆక్సిజన్ పడకలతో కూడిన కొవిడ్ కేర్ కేంద్రాన్ని ఏర్పాటు చేయనుంది. ప్రజలకు పూర్తి ఉచితంగా సేవలందించే ఈ దవాఖాన ఏర్పాటుకు అయ్యే వ్యయంతో పాటు నిర్వహణ వ్యయాన్ని తమ సంస్ధ భరిస్తుందని రిలయన్స్ ఫౌండేషన్ ఓ ప్రకటనలో పేర్కొంది. జామ్ నగర్ లోని ప్రభుత్వ డెంటల్ కాలేజ్ బోధనాసుపత్రిలో 400 కొవిడ్ కేర్ సెంటర్ వచ్చే వారంలో అందుబాటులోకి వస్తుందని వెల్లడించింది.
మరో రెండు వారాల్లో అదే ప్రాంతంలోని మరో చోట 600 పడకల ఆస్పత్రి సేవలందిస్తుందని తెలిపింది. ఈ కేంద్రాల్లో వైద్య సిబ్బంది, పరికరాలు, ఇతర ఖర్చులు అన్నింటిని రిలయన్స్ భరిస్తుందని పేర్కొంది. జామ్ నగర్, ఖంబలియా, ద్వారక, పోర్ బందర్ సహా సౌరాష్ట్రలోని ఇతర ప్రాంతాల ప్రజలకు ఈ దవాఖానలు ఊరట కల్పిస్తాయని వెల్లడించింది. మరోవైపు రిలయన్స్ ఫౌండేషన్ కొవిడ్ కేర్ సెంటర్ల లో డాక్టర్లు, వైద్య సిబ్బంది నియామకంలో గుజరాత్ ప్రభుత్వం సహకరిస్తుందని తెలిపింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

