న్యూఢిల్లీ: రిలయన్స్ ఫౌండేషన్ 2024-25 బ్యాచ్ అండర్ గ్రాడ్యుయేట్ స్కాలర్షిప్ లబ్ధిదారులను ప్రకటించింది. దేశవ్యాప్తంగా దాదా పు ఒక లక్ష మంది వీటికి దరఖాస్తు చేసుకోగా, 5 వేల మందిని ఎంపిక చేసినట్లు తెలిపింది.
ఎంపికైనవారిలో ఒక్కొక్కరికి ట్యూషన్ ఫీజు, హాస్టల్, ఇతర విద్యా సంబంధిత ఖర్చుల కోసం రూ.2 లక్షల వరకు ఆర్థిక సాయం చేయనున్నట్లు తెలిపింది. 850 మంది విద్యార్థులతో ఏపీ మొదటి, 411 మందితో తెలంగాణ నాలుగో స్థానంలో నిలిచిందని వివరించింది. రిలయన్స్ ఫౌండేషన్ వెబ్సైట్ https:// scholar ship s.relian cef oundation.org/UG Scho larship_ApplicationStatus.aspxను ద్వారా ఫలితాలను తెలుసుకోవచ్చని తెలిపింది.