న్యూఢిల్లీ: ఆల్ట్‌న్యూస్ సహ వ్యవస్థాపకుడు మహమ్మద్ జుబేర్ అరెస్టును ఎడిటర్స్ గిల్డ్ ఖండించింది. జుబేర్ అరెస్టు ఆందోళనకరంగా ఉన్నట్లు గిల్డ్ అభిప్రాయపడింది. అతన్ని తక్షణమే రిలీజ్ చేయాలని డిమాండ్ చేసింది. నకిలీ వార్తలను గుర్తించడంలో ఆల్ట్‌న్యూస్ అసాధారణ రీతిలో పనిచేసిందని, చాలా నిష్పక్షపాతంగా ఆ సంస్థ వ్యవహరించినట్లు ఎడిటర్స్ గిల్డ్ తెలిపింది. ప్రభుత్వానికి చెందిన అధికార ప్రతినిధి చేసిన విషపూరిత వ్యాఖ్యలను కూడా పసికట్టింది ఆల్ట్‌న్యూస్ అని గిల్డ్ తన ప్రకటనలో తెలిపింది. 2018లో చేసిన ట్వీట్ ఆధారంగా జుబేర్‌ను ఢిల్లీ పోసులు అదుపులోకి తీసుకున్నారు. ఐపీసీలోని 153, 295 సెక్షన్ల కింద అతన్ని అరెస్టు చేశారు.