ఆ దగ్గు మందులపై విచారణ
దగ్గు మందులతో ఆఫ్రికాలోని గాంబియాలో 66 మంది పిల్లలు మృతిచెందటంతో డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా (డీసీజీఏ) అప్రమత్తమైంది. ఆ మరణాలపై విచారణ ప్రారంభించింది.
- గాంబియాలో పిల్లల మృతితో విచారణకు డీసీజీఏ ఆదేశం
- ల్యాబ్‌కు మందుల శాంపిల్స్
- నివేదిక వచ్చాక చర్యలు
- దేశంలో అమ్మకాలైతే లేవు
న్యూఢిల్లీ/జెనీవా, అక్టోబర్ 6: దగ్గు మందులతో ఆఫ్రికాలోని గాంబియాలో 66 మంది పిల్లలు మృతిచెందటంతో డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా (డీసీజీఏ) అప్రమత్తమైంది. ఆ మరణాలపై విచారణ ప్రారంభించింది. హర్యానాలోని ఓ కంపెనీ తయారు చేసిన 4 రకాల దగ్గు మందులను వాడటం వల్లే గాంబియాలో చిన్నారులు మరణించినట్టు ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) పేర్కొన్నది. ఇదే విషయాన్ని డీసీజీఏ దృష్టికి కూడా తీసుకొచ్చింది. దీంతో స్పందించిన డీసీజీఏ.. భారత్‌లో తయారైన దగ్గు మందుల వల్లే చిన్నారులు మరణించారనడానికి ఆధారాలు సమర్పించాలని డబ్ల్యూహెచ్‌వోకు సూచించింది. మరోవైపు హర్యానా ప్రభుత్వం ఈ నాలుగు రకాల దగ్గు మందుల శాంపిల్స్‌ను సేకరించింది. వీటిని కోల్‌కతాలోని సెంట్రల్ డ్రగ్స్ ల్యాబొరేటరీకి పంపింది. వీటిని పరీక్షించి నివేదిక వచ్చాక తదుపరి చర్యలు ఉంటాయని తెలిపింది.
భారత్‌లో అమ్మకాలు లేవు
ఈ నాలుగు రకాల దగ్గు మందుల ఎగుమతికి అనుమతి ఉన్నదని, అయితే భారత్‌లో అమ్మకం, మార్కెటింగ్‌కు అవి అందుబాటులో లేవని డీసీజీఏ వెల్లడించింది. మందులపై డబ్ల్యూహెచ్‌వో డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ మాట్లాడుతూ ‘భారత్‌లో తయారైన దగ్గు మందుల వల్లనే గాంబియాలో 66 మంది చిన్నారులు మరణించినట్టు అనుమానాలున్నాయి. దీనిపై దర్యాప్తు జరుపుతున్నాం. భారత్‌కు చెందిన డీసీజీఏతోనూ కలిసి పనిచేస్తున్నాం’ అని తెలిపారు. ప్రస్తుతానికి ఆ మందులను గాంబియాలోనే గుర్తించామని, ఇతర దేశాలకూ సరఫరా అయ్యి ఉండొచ్చన్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
- Tags
- DCGA
- Gambia
- Regulatory body
- syrups
RELATED ARTICLES
తాజా వార్తలు
Without Breathing | శ్వాస తీసుకోకుండా ఎక్కువ సేపు ఉండవచ్చా.. దీన్ని అభ్యాసం చేయవచ్చా..?
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్‌కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

