TMC | మమతకు ఊహించని షాక్.. తృణమూల్ కాంగ్రెస్ కొత్త బాస్‌గా సీనియర్ ఎమ్మెల్యే..!
TMC : పశ్చిమ బెంగాల్ మాజీ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ (Mamata Benerjee) వరసగా షాక్‌లు తగులుతున్నాయి. రెబెల్ ఎమ్మెల్యే వర్గం ఆమెను టీఎంసీ(TMC) అధినేత్రిగా తొలగించింది.
TMC : పశ్చిమ బెంగాల్ మాజీ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ (Mamata Benerjee) వరసగా షాక్‌లు తగులుతున్నాయి. అసెంబ్లీ ఎన్నికల్లో పరాజయంతో మొదలు.. రెబెల్ ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపులతో సతమతమవుతున్న మమత ఈసారి ఏకంగా పార్టీ అధ్యక్షురాలి పదవిని కోల్పోయింది. రెబెల్ ఎమ్మెల్యే వర్గం ఆమెను టీఎంసీ(TMC) అధినేత్రిగా తొలగించింది. మమత స్థానంలో టీఎంసీ నాయకుడిగా సీనియర్ ఎమ్మెల్యే అరూప్ రాయ్ ఎంపికయ్యాడు. అంతేకాదు పలువురు సన్నిహితులు సైతం మమతకు దూరమయ్యారు.
తృణమూల్ కాంగ్రెస్‌పై మమతా బెనర్జీ పట్టు కోల్పోయింది. 1998లో టీఎంసీని స్థాపించి మూడు దశాబ్దాలుగా పశ్చిమ బెంగాల్లో చక్రం తిప్పిన మమత.. అనూహ్యంగా పార్టీ చైర్ పర్సన్ పదవికి దూరమయ్యారు. రిటాబ్రతా బెనర్జీ నేతృత్వంలోని రెబెల్ ఎమ్మెల్యేలు మమతను తమ బాస్‌గా నిరాకరించారు. సీనియర్ ఎమ్మెల్యే అరూప్ రాయ్‌ని టీఎంసీ కొత్త నాయకుడిగా ఎన్నుకున్నారు. అంతేకాదు.. తమదే అసలైన తృణమూల్ కాంగ్రెస్ అని రిటాబత్రా వర్గం ప్రకటించింది. అంతటితో సరిపెట్టకుండా మమత మేనల్లుడు అభిషేక్ బెనర్జీని పార్టీ జాతీయ జనరల్ సెక్రటరీగా తప్పించారు.
New TMC has removed Mamata Banerjee from Chairman post.
Aroop Roy is the new Chairman.
Abhishek Banerjee has been expelled from the party. pic.twitter.com/wnJmScSDBf
— Facts (@BefittingFacts) June 22, 2026
స్థానిక న్యూ టౌన్‌లోని హోట్‌లో పార్టీ కౌన్సిలర్లతో సమావేశమైన రిటాబత్రా బెనర్జీ.. పార్టీలో ఐదేళ్ల అనంతరం సంస్థాగత మార్పులు జరగలేదని, అందుకే రాజ్యాంగబద్ధంగా తాము జాతీయ నాయకత్వాన్ని నిర్మిస్తున్నామని పేర్కొన్నారు. ఈ సందర్భంగా మమతను తృణమూల్ కాంగ్రెస్ చైర్ పర్సన్‌గా తొలగిస్తూ.. హౌరా సెంట్రల్ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందిన అరూప్ రాయ్‌కు పగ్గాలు అప్పగించారు. అయితే.. మమత సన్నిహితులు కొందరు మాత్రం ఈ మొత్తం వ్యవహారాన్ని ఒక కామెడీ షోగా అభివర్ణించారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

