కొలంబో, ఏప్రిల్ 26: తీవ్ర ఆర్థిక సంక్షోభం నేపథ్యంలో శ్రీలంకలో ప్రభుత్వ వ్యతిరేక ఆందోళనలు మిన్నంటాయి. అధ్యక్షుడి సెక్రటేరియట్ బయట బీచ్మైదానంలో కొనసాగుతున్న ఆందోళనలు తాజాగా ప్రధాని కార్యాలయం వద్దకు విస్తరించాయి. ఆందోళనకారులు శిబిరాలు ఏర్పాటు చేశారు.
రాజపక్స కుటుంబ నేతృత్వంలోని ప్రభుత్వం వైదొలగాల్సిందేనని, అధ్యక్షుడు గొటబయ, ప్రధాని మహింద రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ‘గొట గో హోం విలేజ్’, మహింద గో హోం విలేజ్’ అంటూ నిరసన శిబిరాల్లో ప్లకార్డులు ప్రదర్శిస్తున్నారు.