Cogress G-23 | అందరినీ కలుపుకుపోవాలి.. కాంగ్రెస్ అసమ్మతి డిమాండ్
Cogress G-23 | కాంగ్రెస్ పార్టీ అధిష్టానం అందరినీ కలుపుకుపోవాలని ఆ పార్టీ అసమ్మతి నేతల సమావేశం డిమాండ్ చేసింది.
Cogress G-23 | 2024 ఎన్నికలకు ఇప్పటి నుంచే పటిష్ట కార్యాచరణ చేపట్టాలని కాంగ్రెస్ అసమ్మతి నేతల సమావేశం తీర్మానించింది. పార్టీలో అందరినీ కలుపుకు పోవాలని పార్టీ అధిష్టానాన్ని డిమాండ్ చేస్తూ 18 మంది నేతల సంతకాలతో ఓ ప్రకటన విడుదలైంది. కాంగ్రెస్ అధిష్టానం తమను పట్టించుకోవడం లేదని గుర్రుగా ఉన్న అసమ్మతి నేతలు (జీ-23) బుధవారం రాత్రి గులాం నబీ ఆజాద్ ఇంట్లో సమావేశమయ్యారు.
ఇప్పటికైనా బీజేపీతో పోరుకు కలిసి వచ్చే పార్టీలతో చర్చలు ప్రారంభించాలని ఈ సమావేశం డిమాండ్ చేసింది. అన్ని స్థాయిల్లో సమగ్ర, సమిష్టి నాయకత్వ విధానాన్ని బలపర్చాలని కోరింది. ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల తర్వాత ఆయా రాష్ట్రాల్లో సంస్థాగత మార్పులు సూచించేందుకు పార్టీ నేతలను నియమించాలని సిఫారసు చేసింది.
ఈ సమావేశానికి సీనియర్ నేతలు కపిల్ సిబాల్, మనీశ్ తివారీ, భూపిందర్ సింగ్ హుడా, పృథ్వీరాజ్ చవాన్, ఆనంద్ శర్మ, అఖిలేశ్ ప్రసాద్ సింగ్, రాజ్‌బబ్బర్, పీజే కురియన్, మణి శంకర్ అయ్యర్ హాజరయ్యారు. అనూహ్యంగా తిరువనంతపురం ఎంపీ శశిథరూర్ హాజరు కావడం గమనార్హం. కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ భేటీ తర్వాత కపిల్ సిబల్ వ్యాఖ్యలు పార్టీలో కాక రేపాయి.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Congress rule | కాంగ్రెస్ పాలనలో మళ్లీ అయిల్ ఇంజన్లు..! కన్నీళ్లతో సాగు చేస్తున్న రైతన్నలు
Smit Machchhar: పైలట్ స్మిత్ మచ్చర్‌కు ఇజ్రాయెల్ ప్రెసిడెన్షియల్ అవార్డు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
KTR | భారత రాజ్యాంగం కంటే ఎవరూ ఎక్కువ కాదు.. జ్ఞానేష్ కుమార్ తక్షణమే వైదొలగాలి: కేటీఆర్
Thailand Queen: గ్రిపెన్ యుద్ధ విమానాన్ని నడిపిన థాయ్‌ల్యాండ్ క్వీన్… వీడియో
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

