న్యూఢిల్లీ: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(RBI) ఇవాళ కీలక ప్రకటన చేసింది. రెపో రేటును 25 బేసిస్ పాయింట్లు తగ్గించింది. 5.5 శాతం నుంచి 5.25 శాతానికి రెపో రేటు తగ్గించారు. మూడు రోజుల పాటు సాగిన మానిటరీ పాలసీ కమిటీ మీటింగ్లో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా పేర్కొన్నారు. రెపో రేటు తగ్గింపు అంశాన్ని ఆయన ఇవాళ ప్రకటించారు. రెపో రేటు తగ్గించడం వల్ల .. మరింత చౌకగా రుణాలు పొందే అవకాశం ఉంటుంది. జూన్లో జరిగిన ఎంపీసీ మీటింగ్లో రెపో రేటును 6 శాతం నుంచి 5.5 శాతానికి తగ్గించారు.
— ReserveBankOfIndia (@RBI) December 5, 2025