ముంబై : రిజర్వ్ బ్యాంక్ ఇండియా గవర్నర్ శక్తికాంత్ దాస్ ఇవాళ మీడియాతో మాట్లాడారు. రెపో రేటను 25 బేసిస్ పాయింట్లు పెంచినట్లు ఆయన తెలిపారు. రెపో రేటు పెంపుతో మళ్లీ పెరగనున్న వడ్డీ రేట్లు పెరగనున్నాయి. దీంతో లోన్ ఈఎంఐలు పెరిగే అవకాశాలు ఉన్నట్లు కూడా అంచనా వేస్తున్నారు. ఆర్బీఐ రెపో రేటును పెంచడం ఇది వరుసగా ఆరోసారి. రెపో రేటును 25 బేసిస్ పాయింట్లు పెంచుతున్నట్లు శక్తికాంత్ దాస్ చెప్పారు. దీంతో రెపో రేటు 6.5 శాతానికి చేరుకున్నది.
కొన్ని నెలల క్రితం ఉన్న ప్రపంచ ఆర్ధిక స్థితి ఇప్పుడు లేదని, చాలా వరకు పెద్ద ఆర్ధిక వ్యవస్థల్లో ప్రగతి కనిపిస్తోందని, కానీ ద్రవ్యోల్బణం స్వల్ప స్థాయిలో ఉన్నట్లు దాస్ వెల్లడించారు. 2023-24లో నాలుగవ క్వార్టర్లో ద్రవ్యోల్బణం సగటున 5.6 శాతం ఉండే అవకాశాలు ఉన్నట్లు దాస్ చెప్పారు. ఈ ఏడాది వాస్తవ జీడీపీ 6.4 శాతంగా ఉంటుదని ఆయన అన్నారు.