ఆర్బీఐ బోర్డు సభ్యుడు గురుమూర్తి అనుచిత వ్యాఖ్యలు
ముంబై, మే 15: ప్రభుత్వ రంగ బ్యాంకుల ఉద్యోగులపై ఆరెస్సెస్ సిద్ధాంతకర్త, ఆర్బీఐ బోర్డు సభ్యుడు ఎస్ గురుమూర్తి అనుచిత వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వ బ్యాంకుల ఉద్యోగులు మురికి వ్యక్తులు, ఏమాత్రం పనికిరాని వారు అంటూ అవమానించేలా మాట్లాడారు. జీతాలు తక్కువని, స్వతంత్రత లేదని ప్రభుత్వ బ్యాంకుల్లోని ప్రతిభావంతులైన ఉద్యోగులు ప్రైవేట్ సెక్టార్కు వెళ్లిపోతున్నారని, దీంతో మనకు పనికిరాని మురికి బ్యాచ్ మాత్రమే మిలిగి ఉన్నదని అన్నారు.
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సమక్షంలోనే ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. గుర్తుమూర్తి వ్యాఖ్యలపై బ్యాంకు ఉద్యోగుల యూనియన్లు, అధికారులు, ప్రతిపక్ష పార్టీల నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆర్బీఐ బోర్డు నుంచి గురుమూర్తి తక్షణం రాజీనామా చేయాలని ఆలిండియా బ్యాంక్ ఎంప్లాయిస్ అసోసియేషన్(ఏఐబీఈఏ) డిమాండ్ చేసింది.