Raymond MD | మాల్దీవ్స్‌లో స్పీడ్ బోట్ ప్రమాదం.. రేమాండ్ ఎండీకి తప్పిన ముప్పు..!
Raymond MD : ప్రముఖ వస్త్ర తయారీ సంస్థ రేమాండ్ ఎండీ గౌతమ్ సింఘానియా(Gautam Singhania)కు కొద్దిలో పెద్ద ముప్పు తప్పింది. మాల్దీవ్స్‌లో జరిగిన స్పీట్ బోట్ ప్రమాదంలో ఆయనకు స్వల్ప గాయాలయ్యాయి.
Raymond MD : ప్రముఖ వస్త్ర తయారీ సంస్థ రేమాండ్ ఎండీ గౌతమ్ సింఘానియా(Gautam Singhania)కు కొద్దిలో పెద్ద ముప్పు తప్పింది. మాల్దీవ్స్‌లో జరిగిన స్పీట్ బోట్ ప్రమాదంలో ఆయనకు స్వల్ప గాయాలయ్యాయి. శుక్రవారం ఆయన ప్రయాణిస్తున్న బోటు హఠాత్తుగా బోల్తా పడింది. ఈ ఘటనలో సింఘానియా అదృష్టవశాత్తూ చిన్నపాటి గాయాలతో బయటపడ్డారు. అనంతరం ఆయన మాల్దీవ్స్ నుంచి ముంబై వచ్చేశారు.
మాల్దీవ్స్‌లో స్పీడ్ బోటు బోల్తా పడడంతో గాయపడిన రేమాండ్ ఎండీ గౌతమ్ సింఘానియా ఆరోగ్యం మెరుగ్గా ఉందని ఆయన అధికార ప్రతినిధి తెలిపారు. ”దురదృష్టవశాత్తూ మాల్దీవ్స్‌లో స్పీడ్ బోటు బోల్తా పడిన ఘటనలో గౌతమ్ సింఘానియాకు చిన్న చిన్న గాయలయ్యాయి. ప్రస్తుతం ముంబైలో చికిత్స తీసుకుంటున్న ఆయన కోలుకుంటున్నారు. పడవ ప్రమాదంలో గాయపడిన వారికోసం ప్రార్ధించినందుకు మీ అందరికీ ధన్యవాదాలు’ అని సింఘానియా అదికార ప్రతినిధి మీడియాకు వెల్లడించారు.
#NewsFatafat | Raymond Group’s Gautam Singhania suffered “minor injuries” in a speedboat capsizing incident in Maldives.
Singhania has been flown back to Mumbai. He is currently being treated at Breach Candy Hospital in South Mumbai. His condition is said to be stable.… pic.twitter.com/Bk5vlurcGQ
— ET NOW (@ETNOWlive) March 20, 2026
స్థానిక మీడియా సమాచారం ప్రకారం పడవ ప్రమాదానికి గురైనప్పుడు అందులో ఏడుగురు ఉన్నారు. గౌతమ్ సింఘానియాతో కలిసి వీరిలో ఐదుగురు భారతీయులు. వావు అటొల్ ప్రాంతంలోని వీ ఫెలిధూ ఐలాండ్ సమీపంలో శుక్రవారం ఉదయం 1.15 గంటలకు స్పీడ్ బోటు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో గౌతమ్ సింఘానియా ప్రాణాలతో బయటపడగా.. ఇద్దరు భారతీయులు గల్లంతయ్యారు. ర్యాలీ డ్రైవర్ హరి సింగ్ ఆచూకీ కూడా లభించడం లేదు. మరో ముగ్గురికి గాయాలయ్యాయి.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Horoscope | 17-10-2026 శనివారం.. మీ రాశి ఫలాలు
మంత్రిగారి సిఫార్సు.. మహా కుంభకోణం వివేక గంగాధరం!
రైతన్నపై ఆంక్షలు.. కాలువల్లో మోటర్లు వాడొద్దు.. నీళ్లు తోడొద్దు
పోటీకి జంకేది లేదు.. ఎవరికైనా చట్టాలు ఒక్కటే.. మస్క్‌కు గట్టిగా కౌంటర్ ఇచ్చిన రిలయన్స్
రేవంత్ సర్కార్‌లో అన్నీ స్కామ్‌లే.. కార్మికుల సొమ్మునూ వదలట్లే
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

