Ratan Tata | రతన్‌టాటా.. నిరాడంబరతకు నిలువెత్తు నిదర్శనం. ఆయన ఒక బిలియనీర్ కావచ్చు. కానీ.. ఆయన సింప్లిసిటీ ముందు, ఆయన మానవత్వం, దయాగుణం ముందు బిలియనీర్ అనే పదం చాలా చిన్నది అవుతుంది. రతన్ టాటా చేసే సేవా కార్యక్రమాలు కానీ.. ఈ దేశం కోసం ఆయన ఇప్పటి వరకు చేసిన సేవ, ఆయన సింప్లిసిటీ గురించి ఎంత చెప్పినా తక్కువే.
అయితే.. మరోసారి ఆయన సింప్లిసిటీ బయటపడింది. డిసెంబర్ 28న తన 84వ పుట్టిన రోజు వేడుకలను టాటా అత్యంత నిరాడంబరంగా జరుపుకున్నారు. కేవలం ఒక చిన్న కప్ కేక్.. దాని మీద రెండు చిన్న క్యాండిల్స్.. అంతే. వాటిని ఊది తన బర్త్‌డేను సెలబ్రేట్ చేసుకున్నారు.
టాటా మోటర్ ఫైనాన్స్‌లో బిజినెస్ డెవలప్మెంట్ మేనేజర్‌గా పనిచేస్తున్న వైభవ్ రతన్ టాటా పుట్టిన రోజు వేడుకలకు సంబంధించిన వీడియోను తన లింక్డిన్ అకౌంట్లో షేర్ చేశాడు. దీంతో ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
రతన్ టాటా ప్రస్తుతం టాటా ట్రస్ట్ చైర్మన్‌గా ఉన్నారు. తన పుట్టినరోజు నాడు ఆఫీసుకు టాటా వెళ్లగానే అక్కడి ఉద్యోగులు ఒక చిన్న కప్కేక్తో ఆయన బర్త్‌డే వేడుకలను జరిపారు. ఆ సమయంలో టాటా పక్కన షతను నాయుడు అనే ఓ ఉద్యోగి ఉన్నాడు. ఆ ఉద్యోగి టాటాకు కప్‌కేక్ తినిపించాడు. అంతకుముందు టాటా తన పుట్టిన రోజు వేడుకలను తన ఫోన్లో రికార్డ్ చేసుకున్నారు.
మరీ ఇంత సింప్లిసిటీనా. రతన్ టాటా పేరు వింటేనే చాలు. ఒక వైబ్రేషన్ స్టార్ట్ అవుతుంది. ఆయన కోట్లాది మంది భారతీయులకు ఆదర్శమూర్తి అంటూ నెటిజన్లు కామెంట్లు చేశారు.