90 ఏండ్ల తర్వాత దర్శనం : అటవీ అధికారులు
Black Dog | ముంబై : మహారాష్ట్రలోని సహ్యాద్రి టైగర్ రిజర్వ్ ఫారెస్ట్‌లో వన్యప్రాణుల ప్రేమికులకు ఒక అరుదైన అటవీ కుక్క దర్శనమిచ్చింది. ఇక్కడి బఫర్ జోన్లో తిరుగుతున్న ఒక పర్యాటకుడికి అరుదైన నల్ల అడవి కుక్క కనిపించింది. ప్రకృతి ప్రేమికుడు దిగ్విజయ్ పాటిల్ దీనిని తన కెమెరాతో ఫొటోలు, వీడియోలను రికార్డ్ చేసి, వ్యన్యప్రాణుల వార్డెన్‌కు విషయాన్ని చేరవేశాడు.
దీంతో నల్ల అడవి కుక్కపై మరింత పర్యవేక్షణ కోసం ఆ ప్రాంతంలో కెమెరా ట్రాప్లను ఏర్పాటుచేశారు. ‘మెలాంస్టిక్ ధోల్’ (ధోలే లేదా రేసుకుక్కలని కూడా పిలుస్తారు)గా పిలుచుకునే దీనిని 90 ఏండ్ల క్రితం కోయంబత్తూర్ సమీపంలో బ్రిటిష్ సైంటిస్ట్ ఆర్సీ మోరిస్ రికార్డ్ చేశాడు. అడవిలో నివసించే క్రూర జంతువుల్లో ఒకటిగా ‘ధోలే’ను పేర్కొంటారు. పులులు, సింహాలకు సైతం భయపడకుండా వేటాడుతాయట!