బెంగళూరు : బంగారం అక్రమ రవాణా కేసులో అరెస్టయిన కన్నడ నటి రన్యా రావు హవాలా మార్గాల్లో డబ్బును కూడా తరలించినట్లు దర్యాప్తు అధికారులు ఆరోపించారు. ఈ కేసులో మూడో నిందితుడు సాహిల్ జైన్ బంగారం వ్యాపారి, రెండో నిందితుడు తరుణ్ రాజు ఆమెకు సన్నిహితుడు. సాహిల్ రిమాండ్ రిపోర్టు ప్రకారం, బెంగళూరు-దుబాయ్ మధ్య దాదాపు రూ.38 కోట్లను హవాలా మార్గాల్లో తరలించేందుకు, సుమారు రూ.40 కోట్ల విలువైన 50 కేజీల బంగారాన్ని తీసుకొచ్చేందుకు తాను రన్యా రావుకు సహకరించానని, ప్రతి లావాదేవీకి తాను రూ.55,000 కమీషన్ తీసుకున్నానని చెప్పాడు.