హైదరాబాద్: భారతదేశంలో అత్యంత విలువైన క్రిప్టో ప్లాట్‌ఫామ్ కాయిన్‌స్విచ్ కుబేర్ భారతీయులకు డబ్బు సంపాదించేందుకు మద్ధతు ఇచ్చే నిరంతర ప్రయత్నాల్లో బాలీవుడ్ సూపర్‌స్టార్ రణవీర్ సింగ్‌తో కలిసి కొత్త వాణిజ్య ప్రకటనను విడుదల చేసింది. ఇటీవలి వాణిజ్య ప్రకటనలో కాయిన్‌స్విచ్ కుబేర్ వినియోగదారులకు క్రిప్టోలో పెట్టుబడులను కేవలం రూ.100తో ప్రారంభించేందుకు అవకాశం కల్పిస్తోంది.
కుచ్తోబద్లేగా పేరుతో ఈ వాణిజ్య ప్రకటనలో భాగంగా కాయిన్ స్విచ్ కుబేర్ 360-డిగ్రీ వాణిజ్య ప్రకటన వివిధ ఆన్లైన్ , డిజిటల్ ప్లాట్‌ఫామ్స్, టెలివిజన్, ప్రింట్ మీడియా తోపాటు డిస్నీ+హాట్‌స్టార్‌లలో ప్రసారమవుతుంది. కాయిన్‌స్విచ్ కుబేర్ చీఫ్ బిజినెస్ ఆఫీసర్ శరణ్ నాయర్ మాట్లాడుతూ, ‘‘వినియోగదారులకు క్రిప్టో కరెన్సీల గురించి అవగాహన కల్పించే నిరంతర ప్రయత్నంలో భాగంగా మేము బాలీవుడ్ సూపర్‌స్టార్ రణ్వీర్ సింగ్ ను ప్రచారకర్తగా నియమించామన్నారు.