IndiGo | సాంకేతిక సమస్య కారణంగా టేకాఫ్ అయిన గంటలోపే వెనక్కి వచ్చిన ఇండిగో ఫ్లైట్.. 24 గంటల్లో రెండో ఘటన
IndiGo | ఢిల్లీ (Delhi) నుంచి రాంచీ (Ranchi) బయలుదేరిన ఇండిగో విమానం (IndiGo flight) సాంకేతిక లోపం (technical snag) కారణంగా టేకాఫ్ అయిన గంటలోపే తిరిగి ఢిల్లీ విమానాశ్రయానికి తిరిగి వచ్చినట్లు అధికారులు తెలిపారు.
IndiGo | ఢిల్లీ (Delhi) నుంచి రాంచీ (Ranchi) బయలుదేరిన ఇండిగో విమానం (IndiGo flight) సాంకేతిక లోపం (technical snag) కారణంగా టేకాఫ్ అయిన గంటలోపే తిరిగి ఢిల్లీ విమానాశ్రయానికి తిరిగి వచ్చినట్లు అధికారులు తెలిపారు. ఇండిగో 6ఈ 2172 విమానం శనివారం ఉదయం 7.40 గంటలకు ఢిల్లీలోని ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి రాంచీకి బయలుదేరింది. అయితే టేకాఫ్ అయిన కొద్దిసేపటికే విమానంలో సాంకేతిక సమస్య తలెత్తడంతో వెనక్కి మళ్లించాల్సి వచ్చింది. దీంతో 8.20 గంటలకు విమానం తిరిగి ఢిల్లీ ఎయిర్ పోర్టులో ల్యాండ్ అయ్యింది. ‘ఢిల్లీ నుంచి రాంచీకి బయల్దేరిన ఇండిగో 6ఈ 2172 విమానంలో సాంకేతిక సమస్య తలెత్తింది. దీంతో ముందు జాగ్రత్తగా తిరిగి ఢిల్లీకి మళ్లించాల్సి వచ్చింది’ అని ఎయిర్ లైన్స్ ఓ ప్రకటనలో తెలిపింది. మరోవైపు అందులోని ప్రయాణికులను మరో విమానంలో గమ్యస్థానానికి పంపేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు విమానాశ్రయ అధికారులు చెప్పారు.
కాగా, సాంకేతిక సమస్యల కారణంగా గాల్లోకి ఎగిరిన కొద్దిసేపటికే ఇండిగో విమానం వెనక్కి మళ్లడం 24 గంటల వ్యవధిలో ఇది రెండో ఘటన. శుక్రవారం బీహార్ (Bihar) రాజధాని పాట్నా (Patna)లోని జయప్రకాశ్ నారాయణ్ అంతర్జాతీయ విమానాశ్రయం (Jay Prakash Narayan International Airport) నుంచి ఢిల్లీ బయల్దేరిన ఇండిగో 6ఈ 2433 విమానం టేకాఫ్ అయిన 3 నిమిషాల్లోనే తిరిగి అత్యవసరంగా ల్యాండ్ అయ్యింది. విమానంలోని ఒక ఇంజిన్ పనిచేయడం లేదని పైలట్ గుర్తించి అధికారులకు తెలియజేశారు. దీంతో అప్రమత్తమైన విమానాశ్రయ అధికారులు విమానాన్ని వెనక్కి మళ్లించారు. ఉదయం 9.11 గంటలకు విమానాన్ని పాట్నా విమానాశ్రయంలోనే సురక్షితంగా ల్యాండ్ చేశారు.
Also Read..
Samantha | చికిత్స కోసం స్టార్ హీరో రూ.25కోట్లు సాయం చేశారంటూ వార్తలు.. స్పందించిన సమంత
Influencer | ఇన్ఫ్లుయెన్సర్ ప్రకటనతో రణరంగంగా న్యూయార్క్.. ఇంతకీ ఏమైందంటే..?
Read Today's Latest National News in Telugu and Telugu News
- Tags
- Delhi
- indigo
- Ranchi
- technical snag
RELATED ARTICLES
తాజా వార్తలు
Animal Abuse | కొంపల్లిలో కుక్కపై సెక్యూరిటీ గార్డు లైంగిక దాడి.. క్యాబిన్లోకి తీసుకెళ్లి మరీ అఘాయిత్యం
Fauzi | ‘ఫౌజీ’ గ్లింప్స్‌లో సుభాష్ చంద్రబోస్‌గా కనిపించింది ఎవరో తెలుసా?
Jurala Project | జూరాల ప్రాజెక్టు ఎస్ఈ కార్యాలయంలో పాత రికార్డులు దగ్ధం!
Jailer 2 | తమిళ చిత్ర పరిశ్రమకు రూ.1000 కోట్ల కల నెరవేరేనా … రజనీకాంత్ ‘జైలర్ 2’పై పెరుగుతున్న అంచనాలు!
AP News | కొండను తొలిచేందుకు జిలెటిన్ స్టిక్స్.. ఎగిరిపడ్డ టిప్పర్.. ఐదుగురు దుర్మరణం..!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

