హైదరాబాద్, జూన్15 (నమస్తే తెలంగాణ): కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కారానికి ఎంపికైన తెలంగాణ బిడ్డ రమేష్ కార్తీక్నాయక్ను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ ప్రత్యేకంగా అభినందించారు. రమేశ్ కార్తీక్ నాయక్ రచించిన ‘డావ్లో-గోర్ బంజారా కథల’ సంకలనానికి అవార్డు దక్కడంపై హర్షం వ్యక్తం చేశారు. రమేశ్ కార్తీక్ నాయక్ మరిన్ని పురస్కారాలను ఆందుకోవాలని, తెలంగాణ ఖ్యాతిని చాటాలని కేటీఆర్ ఆకాంక్షించారు.