e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Thursday, December 2, 2021
Home జాతీయం రాజ్యసభ సెక్రటరీ జనరల్‌గా రామాచార్యులు

రాజ్యసభ సెక్రటరీ జనరల్‌గా రామాచార్యులు

న్యూఢిల్లీ, ఆగస్టు 31: రాజ్యసభ సెక్రటరీ జనరల్‌గా డాక్టర్‌ పీపీకే రామాచార్యులు నియమితులయ్యారు. ఈ మేరకు చైర్మన్‌ వెంకయ్యనాయుడు ఉత్తర్వులు జారీచేశారు. 2018 నుంచి రాజ్యసభ కార్యదర్శిగా రామాచార్యులు పనిచేస్తున్నారు. ప్రస్తుతం సెక్రటరీ జనరల్‌గా ఉన్న దేశ్‌ దీపక్‌ వర్మ మంగళవారం పదవీ విరమణ చేశారు. ఆయన స్థానంలో రామాచార్యులు బాధ్యతలు స్వీకరించనున్నారు. రాజ్యసభలో పనిచేస్తూ సెక్రటరీ జనరల్‌ స్థాయికి ఎదిగిన తొలి అధికారి రామాచార్యులే కావడం విశేషం. 1958 మార్చి 20న పుట్టిన రామాచార్యులు.. 2017లో ఏపీ అసెంబ్లీకి ప్రత్యేక కార్యదర్శిగా పనిచేశారు. రామాచార్యులకు తెలంగాణ అసెంబ్లీ కార్యదర్శి నరసింహాచార్యులు అభినందనలు తెలిపారు.

- Advertisement -
- Advertisement -
Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement