అయోధ్య: ఉత్తరప్రదేశ్లోని అయోధ్యలో రామమందిర ప్రాణప్రతిష్ఠకు ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. ఆదివారం అక్షత పూజతో ప్రాణప్రతిష్ఠ వేడుకలు ప్రారంభమైనట్టు శ్రీరామజన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ తెలిపింది. ఈ అక్షతలను దేశవ్యాప్తంగా పంపిణీ చేయనున్నట్టు వెల్లడించింది. అక్షతల కోసం 100 క్వింటాళ్ల బియ్యం, పసుపు, దేశవాళీ నెయ్యిని వినియోగించినట్టు పేర్కొన్నది. విశ్వ హిందూ పరిషత్ (వీహెచ్పీ) సభ్యులు వీటిని దేశవ్యాప్తంగా పంచుతారని చెప్పింది.