అయోధ్య: రామాలయం ప్రాంగణంలోని 60 శాతం భూమిలో హరిత హారాన్ని అభివృద్ధి చేయబోతున్నారు. శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ చైర్మన్ నృపేంద్ర మిశ్రా తెలిపిన వివరాల ప్రకారం, అయోధ్య నగరంలోకి కాలుష్యం విడుదల కాకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నారు. 60 శాతం భూమిలో తోటలు, పండ్లు, నీడనిచ్చే చెట్లను పెంచుతారు. దీనికి పంచవటి అనే పేరును పెట్టే అవకాశం ఉంది. వీటి పెంపకంతోపాటు పర్యావరణ పరిరక్షణ బాధ్యతలను జీఎంఆర్ గ్రూప్‌నకు అప్పగించారు. ఈ సంస్థ ఐదేళ్ల వరకు ఈ పనులు చేస్తుంది.