Ayodhya | అయోధ్య, సెప్టెంబర్ 15: ఎంతో పవిత్రమైన యూపీలోని అయోధ్య రామజన్మభూమి ఆలయం వద్ద ఘోరం చోటు చేసుకుంది. అందులో పారిశుద్ధ్య సిబ్బందిగా పనిచేసే ఒక మహిళపై ఐదుగురు సామూహిక లైంగిక దాడికి పాల్పడ్డారు. బీఏ మూడో ఏడాది విద్యార్థిని అయిన బాధితురాలి కథనం ప్రకారం.. అయోధ్య జిల్లా సహదత్‌గంజ్‌కు చెందిన వాన్ష్ చౌదరి ఆమెకు గత నాలుగేండ్లుగా స్నేహితుడు. ఆగస్టు 16న అతడు ఆమెను ఒక గెస్ట్‌హౌస్‌లోకి తీసుకువెళ్లి అక్కడే నిర్బంధించాడు. కొద్ది సేపటి తర్వాత వాన్ష్, మరో ఇద్దరు కలిసి ఆమెపై లైంగిక దాడి చేశారు. తర్వాత వారు మరో ముగ్గురిని పిలవటంతో వారు కూడా ఆమెపై లైంగిక దాడికి పాల్పడ్డారు.
తర్వాత ఆమెను గెస్ట్‌హౌస్ నుంచి బన్విర్పూర్ బ్యారేజ్‌కు తీసుకువెళ్లి అక్కడ మరోసారి అఘాయిత్యానికి పాల్పడ్డారు. ఆగస్టు 18న ఆమెను విడిచిపెట్టారు. ఈ విషయం ఎవరికైనా చెబితే ఆమె సోదరితో పాటు కుటుంబ సభ్యులను చంపేస్తామంటూ బెదిరించారు. అక్కడితో ఆమె కష్టాలు తీరిపోలేదు. ఆగస్టు 25న సైతం ఆమెను రామజన్మభూమి ఆలయ మార్గంలో అడ్డుకున్న వాన్ష్, మరో ముగ్గురు ఆమెను బలవంతంగా కారులో ఎక్కించి లైంగిక దాడికి యత్నించారు. అదే సమయంలో కారుకు చిన్న ప్రమాదం జరగడంతో ఆమె తప్పించుకుంది.
ఆగస్టు 26న బాధితురాలు పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేసినా వారు కేసు నమోదు చేసుకోలేదు. ఎట్టకేలకు సెప్టెంబర్ 2న కంటోన్మెంట్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు కావడంతో ప్రధాన నిందితుడు వాన్ష్ సహా వినయ్, షరీక్, శివ, ఉదిత్ లను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. దీనిపై సమాజ్‌వాదీ చీఫ్ అఖిలేశ్ యాదవ్ స్పందిస్తూ నిందితులను కఠినంగా శిక్షించాలని, సకాలంలో స్పందించని పోలీసులపై చర్య తీసుకోవాలని డిమాండ్ చేశారు. బాధితురాలి ఆవేదనకు సంబంధించి 13 సెకండ్ల క్లిప్‌ను ఆయన ఎక్స్‌లో షేర్ చేశారు.