దేశవ్యాప్తంగా ఉద్యమం
- రైతన్నలు సిద్ధం కావాలని రాకేశ్ టికాయిత్ పిలుపు
- అజయ్ మిశ్రాను మంత్రిగా తొలగించాలని డిమాండ్
లఖింపూర్, ఆగస్టు 19: డిమాండ్ల సాధన కోసం దేశవ్యాప్తంగా నిరసనలు చేపట్టేందుకు రైతన్నలు సిద్ధం కావాలని భారతీయ కిసాన్ యూనియన్ నేత రాకేశ్ టికాయిత్ పిలుపునిచ్చారు. మద్దతు ధరపై చట్టం తీసుకురావాలని, కేంద్రమంత్రి అజయ్ కుమార్ మిశ్రాను తొలగించాలని డిమాండ్ చేస్తూ సంయుక్త కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో గురువారం ఉత్తరప్రదేశ్‌లోని లఖింపూర్ ఖీరీ జిల్లా రాజాపూర్ మండి సమితి వద్ద ప్రారంభమైన 72 గంటల నిరసన దీక్ష శుక్రవారం విజయవంతంగా కొనసాగింది.
దేశవ్యాప్త నిరసనలకు సరైన సమయంలో సరైన వేదిక, విధానం గురించి ఎస్కేఎం నేతలు ఎప్పటికప్పుడు సమాచారం అందిస్తారని తెలిపారు. కేంద్రమంత్రి అజయ్‌మిశ్రాను లఖింపూర్ కేసులో నిందితుడిగా చేర్చాలని డిమాండ్ చేశారు. జైళ్లలో మగ్గుతున్న రైతులను విడిచిపెట్టాలని, మద్దతుధరపై చట్టం తీసుకురావాలని, విద్యు త్తు సవరణ బిల్లు ఉపసంహరణ, చెరు కు బకాయిలు చెల్లింపు, రైతులకు భూ హక్కులు కల్పించాలని ఎస్కేఎం డిమాండ్ చేస్తున్నది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bhatti vs Revanth | భట్టి వర్సెస్ రేవంత్.. ముదురుతున్న వివాదం.. విద్యుత్ అధికారులపై సీఎం వ్యాఖ్యలతో కలకలం
Manne Krishank | ఒకటి కాదు మూడు ఆధారాలు చూపిస్తా.. మెడికవర్ ఆసుపత్రి షేర్లపై రేవంత్‌రెడ్డికి క్రిశాంక్ సవాల్!
Punjagutta Temple: పంజాగుట్ట దుర్గాభవానీ గుడిలో సరస్వతీ దేవి అలంకారములో అమ్మవారు
Hyderabad | పీవీ ఎక్స్‌ప్రెస్‌వేపై యాక్సిడెంట్.. ఒకదానికొకటి ఆరు కార్లు ఢీ
Tesla Flying Car: టెస్లా ఫ్లయింగ్ కార్ వచ్చేసింది.. గాలిలో పల్టీలు కొట్టి.. సేఫ్‌గా ల్యాండైన రోడ్‌స్టర్ 2.. వీడియో
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

