న్యూఢిల్లీ, జూన్ 18: విపక్షాల ఐక్యతతో 2024 లోక్సభ ఎన్నికల్లో అధికార బీజేపీకి ఓటమి తప్పదని రాజ్యసభ ఎంపీ కపిల్ సిబల్ పేర్కొన్నారు. బీజేపీకి వ్యతిరేకంగా ప్రతిపక్షాలు ఏకం కావాలని, అభ్యర్థులను బరిలోకి దింపే విషయంలో సర్దుబాట్లు చేసుకోవడంతో పాటు ఉమ్మడి అజెండాతో పనిచేయాలని అన్నారు.
ఆయా రాష్ర్టాల్లో పార్టీల బలాబలాల ఆధారంగా టిక్కెట్ల పంపకం ఉండాల్సిన అవసరం ఉన్నదని అభిప్రాయపడ్డారు. సార్వత్రిక ఎన్నికలు ఈసారి వివిధ అంశాల ప్రాతిపదికన జరుగుతాయని, ఎన్నికలకు సంబంధించి స్టేట్మెంట్ల విషయంలో పార్టీలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు.