న్యూఢిల్లీ: రాజ్యసభ ప్రివిలేజ్ కమిటీ సమావేశాన్ని మార్చి 3వ తేదీన పార్లమెంట్లో నిర్వహించనున్నారు. అయితే ఇవాళ కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్‌పై ప్రసంగం ముగించిన తర్వాత సభను మార్చి 14వ తేదీకి వాయిదా వేశారు. దీంతో బడ్జెట్ 2022 తొలి సెషన్ ముగిసింది. జనవరి 31వ తేదీన బడ్జెట్ తొలి దశ సమావేశాలు ప్రారంభం అయిన విషయం తెలిసిందే. ఇక రెండవ దశ సమావేశాలు మార్చి 14వ తేదీ నుంచి ఏప్రిల్ 8వ తేదీ వరకు జరగనున్నాయి. సభ సజావుగా సాగిన నేపథ్యంలో సభ్యులందరికీ డిప్యూటీ చైర్మెన్ హర్షం ప్రశంసలు తెలిపారు. బడ్జెట్ సెషన్ తొలి దశలో ఎటువంటి వాయిదాలు వేయలేదని ఆయన అన్నారు. సభలోని సభ్యులందరికీ ఈ సందర్భంగా కాంప్లిమెంట్ ఇస్తున్నానని, భవిష్యత్తులోనూ ఇలాంటి స్పూర్తినే కొనసాగించాలని డిప్యూటీ చైర్మెన్ హరివంశ్ తెలిపారు.