న్యూఢిల్లీ: మాజీ బ్యూరోక్రాట్ రాజ్‌కుమార్ గోయల్ భారత ప్రధాన సమాచార కమిషనర్ (సీఐసీ)గా ప్రమాణ స్వీకారం చేశారు. సోమవారం రాష్ట్రపతి భవన్లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆయనతో ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమానికి ఉప రాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్, కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ సహా పలువురు ప్రముఖులు హాజరయ్యారు. సెప్టెంబర్ 13 నుంచి సీఐసీ పోస్ట్ ఖాళీగా ఉండటంతో, ప్రధాని మోదీ, అమిత్ షా, రాహుల్‌గాంధీలతో కూడిన ముగ్గురు సభ్యుల కమిటీ గతవారం నూతన సీఐసీగా రాజ్‌కుమార్‌ను ఎంపికచేసింది. అలాగే 8 మంది సమాచార కమిషనర్ల పేర్లను కూడా ఖరారు చేశారు. దీంతో దాదాపు 9 ఏండ్ల తర్వాత సీఐసీ పూర్తిస్థాయిలో పనిచేయడానికి ఆస్కారం ఏర్పడింది. మొత్తం 10 మంది కమిషనర్లు ఉండాల్సిన కమిషన్ ఇప్పటివరకు ఇద్దరితో నెట్టుకొచ్చింది.