సోమవారం 25 జనవరి 2021
National - Dec 21, 2020 , 15:22:30

సూప‌ర్ స్టార్‌ ర‌జ‌నీకాంత్‌కు మ‌రోసారి స‌మ‌న్లు

సూప‌ర్ స్టార్‌ ర‌జ‌నీకాంత్‌కు మ‌రోసారి స‌మ‌న్లు

చెన్నై : తమిళనాడులోని తూత్తుకుడి స్టెరిలైట్ రాగి కర్మాగారానికి వ్యతిరేకంగా 2018 మే 21, 22 తేదీల్లో జ‌రిగిన ఆందోళ‌న‌ల‌ను అదుపు చేసేందుకు పోలీసులు జరిపిన కాల్పుల్లో 13 మంది ప్రాణాలు కోల్పోగా, మరికొందరు గాయప‌డ్డ విష‌యం విదిత‌మే. ఈ ఘటనపై నాడు  సూపర్ స్టార్ రజనీకాంత్ స్పందిస్తూ.. కొన్ని అసాంఘిక శక్తులు ప్రవేశించడం వల్లే పోలీసులు కాల్పులు జరిపారని పేర్కొన్నారు. ఆయన వ్యాఖ్యలు అప్పట్లో దుమారం రేపాయి. 

అయితే ఈ వ్యాఖ్య‌ల‌పై వివ‌ర‌ణ ఇవ్వాల‌ని తాజాగా ర‌జ‌నీకాంత్‌కు ఒక మ‌హిళా జ్యుడిషియ‌ల్ ప్యానెల్ మ‌రోసారి స‌మ‌న్లు జారీ చేసింది. గ‌తంలో కూడా మ‌ద్రాస్ హైకోర్టు మాజీ న్యాయ‌మూర్తి అరుణ్ జ‌గ‌దీశ‌న్ నేతృత్వంలోని క‌మిష‌న్ ర‌జ‌నీకాంత్‌కు స‌మ‌న్లు జారీ చేసిన‌ప్ప‌టికీ విచార‌ణ‌కు ఆయ‌న హాజ‌రు కాలేదు. దీంతో తాజాగా ఇప్పుడు మ‌రోసారి స‌మ‌న్లు జారీ అయ్యాయి.  

సంఘ విద్రోహ శ‌క్తులు ఆందోళ‌న‌ల్లో పాల్గొన‌డం వ‌ల్లే పోలీసులు కాల్పులు జ‌రిపార‌ని అధికారంలో ఉన్న అన్నాడీఎంకే కూడా పేర్కొంది. సంఘ విద్రోహ శ‌క్తుల‌ను అణిచివేయాల‌ని ప్ర‌భుత్వాన్ని ర‌జ‌నీకాంత్ నాడు డిమాండ్ చేశారు.  

తమిళనాడులోని తూత్తుకూడిలో మైనింగ్‌ సంస్థ వేదాంతకు చెందిన స్టెరిలైట్‌ కాపర్‌ సంస్థను మూసివేస్తూ తమిళనాడు కాలుష్య నియంత్రణ మండలి తీసుకున్న నిర్ణయాన్ని మద్రాస్‌ హైకోర్టు సమర్థించిన విష‌యం తెలిసిందే. కాలుష్య కారకాలను బ‌హిర్గ‌తం చేస్తున్న‌ద‌ని స్థానికులు 2018 మే 21, 22 తేదీల్లో స్టెరిలైట్‌కు వ్యతిరేకంగా భారీ ఆందోళనలు చేశారు. స్టెరిలైట్‌ సంస్థను మూసివేస్తూ ఆ మరుసటి రోజు మే 23న రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి ఆదేశాలు జారీచేసింది. 

ఇవి కూడా చదవండి..

షూటింగ్‌లో కుప్పకూలిపోయిన బాలీవుడ్ హీరో.. !

అంద‌రి మ‌న‌సులు గెలుచుకున్న అభిజీత్ త‌ల్లి

KGF @ 2 ఇయర్స్..రాఖీ భాయ్ కు బాక్సాఫీస్ ఫిదా

బిగ్ బాస్ 4 తెలుగు ఫినాలే కోసం ఎంత ఖర్చు చేసారు..?

ఇపుడు కూలెస్ట్ ప‌వ‌న్ క‌ల్యాణ్ తో..ట్విట‌ర్ లో రానా

రియ‌ల్ హీరోకి గుడిక‌ట్టి పూజిస్తున్న తెలంగాణ ప్ర‌జ‌లు

11 మిలియ‌న్ ఫాలోవ‌ర్స్ సొంతం చేసుకున్న తొలి హీరో

బిగ్ బాస్ విన్న‌ర్ ఇంట విషాదం.. శోకసంద్రంలో కుటుంబ స‌భ్యులు


logo