నేడు ప్రత్యేక విమానంలో పయనం?
చెన్నై, జూన్ 17: సూపర్‌స్టార్ రజనీకాంత్ వైద్య పరీక్షల కోసం అమెరికా వెళుతున్నారు. ఆయన ప్రయాణం ఆకస్మికంగా ఖరారైంది. శుక్రవారం రాత్రే ఆయన ప్రత్యేక విమానంలో వెళ్లనున్నారని తెలిసింది. ముందుగా ఈ నెల 20న బయలుదేరాలని భావించినప్పుటికీ ఇంకా ముందే వెళుతున్నారు. గత ఏడాది డిసెంబర్లో హైదరాబాద్‌లో షూటింగ్లో ఉన్నప్పుడు రక్తపోటులో హెచ్చుతగ్గులతో రజనీకాంత్ అస్వస్థతకు గురయ్యారు. ఆరోగ్య కారణాలతో పాటు తమిళనాడులో కరోనా కర్ఫ్యూ వల్ల కొన్నాళ్లుగా ఆయన పెద్దగా ఎవర్నీ కలుసుకోవడం లేదు. అమెరికాలో వైద్య పరీక్షల అనంతరం అక్కడే కుటుంబంతో కొన్నాళ్ల పాటు ఉండాలని రజనీకాంత్ భావిస్తున్నట్టు సమాచారం.