జైపూర్: దొంగలు ఇండ్లలోనో, షాపుల్లోనో డబ్బు, నగా, నట్రా ఎత్తుకెళ్లాలి కానీ లైట్లు ఎత్తుకెళ్లడం ఏంటనుకుంటున్నారా.. అవును.. వీల్లో వింతదొంగలు ఉన్నట్లున్నారు. అర్ధరాత్రివేళ దుకాణాల ముందున్న లైట్లను దొంగిలించారు. అదీ కారులో వచ్చిమరీ. ఈ వింత ఘటన రాజస్థాన్లోని ఝున్ఝునులో జరిగింది.
ఝున్ఝునులోని కొల్సియా గ్రామంలో ఉన్న ఓ వీధికి కొందరు వ్యక్తులు కారులో వచ్చారు. ఓ షాపు ముందు తమ కారును ఆపి.. దుకాణానికి ఉన్న లైటును తీయడానికి ప్రయత్నించారు. అయితే అది అందకపోవడంతో ఆ ప్రయత్నాన్ని విరమించుకున్నారు. ఎదురుగా ఉన్న షాపు ముందు కుర్చీ కనిపించడంతో దాని సాయంతో ఆ లైటు తీయాలనుకున్నారు. అయితే అక్కడే బల్బు ఉందని కారులో ఉన్నవాళ్లు చెప్పడంతో ఓ వక్తి.. ఆ షాపు ముందున్న పోల్కు బల్బును తీసి కారులో వెళ్లిపోయారు. ఇదంతా అక్కడే ఉన్న కెమెరాలో రికార్డయింది.
అయితే షట్టర్ శబ్ధం రావడంతో తాను లేచానని ఆ షాపు యజమాని మహేంద్ర దూత్ చెప్పారు. తాను లేచి చూసేప్పటికి మరో దుకాణం ముందున్న పోల్కు బల్బు ఎత్తుకెళ్లిపోయారని తెలిపారు. ఈఘటనపై కేసు నమోదుచేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అయితే వారు లైట్ల కోసమే వచ్చారా లేదా వీధిలో ఉన్న బల్బులన్నీ తీసేసి షాపుల్లో భారీ లూటీ చేద్దామనుకున్నారనే విషయం దర్యాప్తులో తేలుతుందన్నారు.