బార్మర్: రాజస్తాన్లో విద్యార్థుల ఆందోళన వాళ్ల అరెస్టుకు దారి తీసింది. కాలేజీలో ఎగ్జామ్ ఫీజు పెంపును వ్యతిరేకిస్తూ ధర్నా చేస్తున్న విద్యార్థులను పోలీసులు అరెస్టు చేశారు. అయితే బార్మర్ జిల్లా కలెక్టర్ టీనా దాబి( Collector Tina Dabi)పై అనుచిత వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో ఇద్దరు విద్యార్థి నేతలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దీంతో ఆ గొడవ మరింత ముదిరింది. ఇద్దరి విద్యార్థుల అరెస్టును ఖండిస్తూ కాలేజీ స్టూడెంట్స్ కొత్వాల్ పోలీసు స్టేషన్లో బైఠాయించారు.
ముల్తాన్బాల్ బిక్చాంద్ వుమెన్స్ కాలేజీ వద్ద ఏబీవీపీ విద్యార్థి నేతలు ధర్నా చేపట్టారు. ఫీజు మూడు రెట్లు పెరగడాన్ని విద్యార్థులు నిరసించారు. ఆర్థికంగా బలహీనంగాఉన్నవారికి ఉన్నత విద్య దూరం అవుతుందని విద్యార్థులు ఆరోపించారు. కలెక్టర్ వద్దకు వెళ్లి మీ సమస్యను చెప్పుకోవచ్చు కదా అని మీడియా అడగ్గా, ఆ విద్యార్థులు కలెక్టర్ వైఖరిని ఖండించారు. కలెక్టర్ టీనా దాబీకి విద్యార్థుల సమస్యలు పట్టవని, ఆమె కేవలం సోషల్ మీడియాలో రీల్ స్టార్ మాత్రమే అని ఓ విద్యార్థి ఆరోపించారు. ఆ వ్యాఖ్యలను తప్పుపట్టిన పోలీసులు వారిని అరెస్టు చేశారు.
కలెక్టర్ టీనా దాబీ తరుచూ తమ జిల్లా అభివృద్ధి పనులను ఎప్పుడూ సోషల్ మీడియాలో పోస్టు చేస్తున్నారు. దీంతో ఆమె ఆన్లైన్లో పాపులర్ అయ్యారు. అయితే కలెక్టర్ వద్దకు వెళ్లి సమస్యను చెప్పుకునే పరిస్థితి లేదని, ఆమె ఇప్పుడు ఓ రీల్ స్టార్ అని విద్యార్థి నేత ఆరోపించారు. ఆ విద్యార్థుల్ని అరెస్టు చేయడంతో వుమెన్స్ కాలేజీ స్టూడెంట్స్ పోలీసు స్టేషన్ ముందు ధర్నా చేపట్టారు. ఈ ఘటన పట్ల కలెక్టర్ టీనా దాబీ స్పందించారు. అది విద్యార్థులు, జోద్పూర్ వర్సిటీ మధ్య సమస్య అని, దానికి జిల్లా యాజమాన్యంతో సంబంధంలేదన్నారు. ఫీజును వెనక్కి తీసుకుంటామని యూనివర్సిటీ వీసీ హామీ ఇచ్చినట్లు దాబీ పేర్కొన్నారు. విద్యార్థులను అరెస్టు చేయలేదని బార్మర్ పోలీసులు స్పష్టం చేశారు.
Students of #Barmer College were protesting against the Fee Hike and wanted to meet collector Tina Dabi.
Police: Madam is busy. She can not Meet you now. She is your role Model.
Students: She is not our Role Model, She is Reel Star.
Police: Now we will arrest you for saying this.… https://t.co/3dorDcPNzG pic.twitter.com/HXGC9YNwZL— NCMIndia Council For Men Affairs (@NCMIndiaa) December 20, 2025