జైపూర్: రాజస్థాన్‌లో ఏడు మంది సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లను అరెస్టు చేశారు. వాళ్లు నడి రోడ్డుపై బీర్లు పంపిణీ (Beer Distribution)చేశారు. ఇటీవల ఏకాదశి రోజున జైపూర్ నగరంలో.. బాటసారులకు, బైక్‌పై వెళ్తున్న వాళ్లకు, ఆటోడ్రైవర్లకు .. బీరు పోసి తాగమన్నారు. హిందువులు పవిత్రంగా భావించే రోజున ఈ ఘటన జరిగింది. దీనిపై తీవ్ర విమర్శలు వచ్చాయి. దీంతో పోలీసులు రంగ ప్రవేశం చేసి ఆ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లను పట్టుకున్నారు.
ఇన్ఫ్లుయెన్సర్ లప్పూ సచిన్ అలియాస్ సచిన్ సింగ్.. బీరును గ్లాసులో పోసి పంచాడు. అతనితో పాటు మరో ఆరు మంది ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆటో డ్రైవర్‌కు కూడా బీరు తాగించారు. అయితే ఇదంతా వీడియో తీశారు. ఆ వీడియో వైరల్ అయ్యింది. దీంతో పోలీసులు ఏడు మంది ఇన్ఫ్లుయెన్సర్లను అరెస్టు చేశారు. అరెస్టు అయినవారిలో సచిన్ సింగ్, ప్రదీప్ కద్వసరా, వికాశ్ వర్మ, అభిషేక్ నిర్మల్, సునిల్ కుమార్ , ఆదిత్య మహారియ, అంకిత్ మేఘ్వాల్ ఉన్నారు. వాళ్లు ఇచ్చిన ఆల్కాహాల్ పార్టీపై అనేక మంది విస్మయం వ్యక్తం చేశారు.
&
Hello @jaipur_police ye ladke logon ko road par rok rok ke drink and drive karwa rahe hain. In sabka challan kaato aur in ladko ko thode din jail ki drink pilao
pic.twitter.com/ViSW3BSxvA— Madhur (@ThePlacardGuy) June 10, 2025
;
బీరు దానానికి చెందిన విషయాన్ని ఓ వ్యక్తి జైపూర్ పోలీసులకు తెలియజేశాడు. మతపరమైన మనోభావాలను దెబ్బతీయాలన్న ఉద్దేశంతో వీడియోను తీయలేదని వాళ్లు పేర్కొన్నారు. సోషల్ మీడియా ఫాలోవర్లను పెంచుకునేందుకు ఆ వీడియోను తీసినట్లు చెప్పారు. ఆ తర్వాత క్షమాపణ వీడియోను కూడా ప్రజెంట్ చేశారు. చెవులు పట్టుకుని, మోకాళ్లపై కూర్చుని ఆ వీడియో తీశారు.
छैले बनकर, सड़क पर बियर बाँटने की रील बना रहे थे
जयपुर पुलिस ने इनकी रेल बना दी pic.twitter.com/iiEBpGnJVC— Laxmikant bhardwaj (@lkantbhardwaj) June 10, 2025