జైపూర్: రాజస్థాన్‌లో ప్రభుత్వ ఉపాధ్యాయుల రిక్రూట్మెంట్లో మహిళలకు 50 శాతం రిజర్వేషన్ కేటాయించారు. (Reservation For Women) దీని కోసం రాజస్థాన్ పంచాయతీరాజ్ చట్ట సవరణకు సీఎం భజన్ లాల్ శర్మ ఆమోదం తెలిపారు. ముఖ్యమంత్రిగా ఆరు నెలలు పూర్తయిన సందర్భంగా శనివారం ఈ ప్రకటన చేశారు. ఈ నిర్ణయంతో మేనిఫెస్టోలో ఇచ్చిన మరో హామీని నెరవేర్చినట్లు ఎక్స్‌లో పేర్కొన్నారు. మహిళా శక్తితో రాజస్థాన్ అభివృద్ధి సాధిస్తుందని తెలిపారు. రాష్ట్ర మహిళలకు కొత్త అవకాశాలు, ఉపాధిని సృష్టించడంలో ఈ నిర్ణయం దోహదపడుతుందని ఆ పోస్ట్‌లో పేర్కొన్నారు.
కాగా, రాజస్థాన్‌లోని థర్డ్ గ్రేడ్ టీచర్ల కేటగిరీలో మహిళలకు 30 శాతం రిజర్వేషన్ కోటా ఉంది. అయితే ఈ రిజర్వేషన్‌ను మరో 20 శాతం పెంచారు. దీంతో టీచర్స్ రిక్రూట్మెంట్లో మహిళల రిజర్వేషన్ 50 శాతానికి చేరింది. రాజస్థాన్‌లో సుమారు 1.50 లక్షల గ్రేడ్ థర్డ్ ఉపాధ్యాయుల పోస్టులు ఉన్నాయి. ఇంకా 27 వేల గ్రేడ్ థర్డ్ టీచర్ల పోస్టులు ఖాళీగా ఉన్నాయి. రానున్న రోజుల్లో వీటిని భర్తీ చేయనున్నారు.
संकल्प पत्र का एक और वादा हमारी सरकार ने किया पूरा…
राजस्थान की नारी शक्ति के सर्वांगीण उन्नयन की दिशा में हमारी सरकार द्वारा तृतीय श्रेणी शिक्षक भर्ती में महिलाओं के लिए आरक्षण की सीमा 30 प्रतिशत से बढ़ाकर 50 प्रतिशत करने का निर्णय लिया गया है।
यह निर्णय 'सशक्त नारी,… pic.twitter.com/rKROdc2Tuu
— Bhajanlal Sharma (@BhajanlalBjp) June 14, 2024