గ్యాస్ ట్యాంకర్ లారీ ఢీ.. నలుగురు సజీవదహనం
గ్యాస్ ట్యాంకర్, లారీ ఎదురెదురుగా వెళ్తూ వేగంగా ఢీకొనడంతో ఘోరం జరిగిపోయింది. గ్యాస్ ట్యాంకర్ పేలిపోయి ఒక్కసారిగా రెండు వాహనాలకు మంటలు అంటుకోవడంతో.. వాటిలో ఉన్న నలుగురు సజీవదహనమయ్యారు.
అజ్మీర్: గ్యాస్ ట్యాంకర్, లారీ ఎదురెదురుగా వెళ్తూ వేగంగా ఢీకొనడంతో ఘోరం జరిగిపోయింది. గ్యాస్ ట్యాంకర్ పేలిపోయి ఒక్కసారిగా రెండు వాహనాలకు మంటలు అంటుకోవడంతో.. వాటిలో ఉన్న నలుగురు సజీవదహనమయ్యారు. రాజస్థాన్ రాష్ట్రంలోని అజ్మీర్ జిల్లాలో జాతీయ రహదారిపై ఈ ఘటన చోటుచేసుకుంది.
రెండు భారీ వాహనాలు ఎదురెదురుగా ఢీకొనగానే ట్యాంకర్ పేలిపోయి మంటలు అంటుకున్నాయని, ఇదంతా క్షణాల్లో జరిగిపోవడంతో ఆ రెండు వాహనాల్లో ఉన్న నలుగురు తప్పించుకోవడానికి అవకాశం లేకుండాపోయిందని, దాంతో సజీవ దహనమయ్యారని పోలీసులు తెలిపారు. ట్యాంకర్‌లోని పెట్రోలియం గ్యాస్ చిల్లడంతో ఆ సమయంలో ఆ మార్గం గుండా వెళ్తున్న ఇతర వాహనాలకు, సమీపంలోని ఇండ్లు, దుకాణాలకు కూడా స్వల్పంగా మంటలు అంటుకున్నాయని చెప్పారు.
సమాచారం అందిన వెంటనే అగ్నిమాపక సిబ్బందితో కలిసి తాము హుటాహుటిన ఘటనా ప్రాంతానికి చేరుకున్నామని, మంటలను ఆర్పవేశామని తెలిపారు. కాగా, ప్రమాద విషయం తెలిసిన వెంటనే జిల్లా కలెక్టర్ అన్షుదీప్, ఎస్పీ చునారామ్ కూడా ఘటనా ప్రాంతానికి చేరుకుని పరిస్థితిని పర్యవేక్షించారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

