Congress leader | ఉప ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ వేసిన ఓ నేతను కాంగ్రెస్ (Congress leader) పార్టీ సస్పెండ్ చేసింది. రాజస్థాన్ (Rajasthan)లో ఖాళీగా ఉన్న అసెంబ్లీ స్థానాలకు ఈనెల 13న ఉప ఎన్నికలు (bypolls) జరగనున్న విషయం తెలిసిందే. అయితే, ఈ ఎన్నికల్లో డిమోలి-ఉనియారా అసెంబ్లీ స్థానం నుంచి నరేష్ మీనాకు కాంగ్రెస్ పార్టీ టికెట్ నిరాకరించింది. అక్కడ కేసీ మీనాను బరిలోకి దింపింది. దీంతో తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన నరేష్ మీనా స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. దీంతో ఆగ్రహానికి గురైన హస్తం పార్టీ నరేష్ మీనాపై సస్పెండ్ వేటు వేసింది (suspended).
కాగా, రాజస్థాన్‌లోని ఖాళీగా ఉన్న మొత్తం 7 అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు నిర్వహించనున్నట్లు ఎన్నికల సంఘం ఇటీవలే ప్రకటించిన విషయం తెలిసిందే. జుంఝును, దౌసా, డియోలి-ఉనియారా, ఖిన్వ్సర్, చోరాసి, సాలంబెర్, రామ్‌గఢ్ స్థానాలకు ఈనెల 13న ఎన్నికలు నిర్వహించనుంది. నవంబర్ 23న ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలు వెల్లడించనున్నారు. రాజస్థాన్‌తోపాటు దేశంలో ఖాళీగా ఉన్న మరికొన్ని అసెంబ్లీ స్థానాలకు కూడా నవంబర్ 13న ఎన్నికలు జరగనున్నాయి.
Also Read..
Gold Rates | ట్రంప్ గెలుపుతో.. దిగొచ్చిన బంగారం ధరలు
Rishi Sunak | బెంగళూరులో మెరిసిన బ్రిటన్ మాజీ ప్రధాని.. భార్యతో కలిసి కాఫీషాప్‌లో సందడి
Stubble Burning | కేంద్రం కీలక నిర్ణయం.. పంట వ్యర్థాలు తగలబెట్టే రైతులకు రెట్టింపు జరిమానా