బైపూర్ : దేశంలో కరోనా విజృంభణ కొనసాగుతున్నది. సాధారణ పౌరులతో పాటు పెద్ద ఎత్తున ప్రముఖులు మహమ్మారి బారినపడుతున్నారు. ఇప్పటికే పలువురు సినీ, రాజకీయ, ఇతర రంగాలకు చెందిన వైరస్ బారినపడ్డ విషయం తెలిసిందే. రెండు రోజుల కిందట ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు సైతం వైరస్ సోకింది. తాజాగా రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ సైతం వైరస్ బారినపడ్డారు.
ఈ విషయాన్ని ఆయన ట్విట్టర్ ద్వారా తెలిపారు. సాయంత్రం కొవిడ్ పరీక్షలు చేయించుకోగా.. పాజిటివ్ వచ్చిందని చెప్పారు. తేలికపాటి లక్షణాలు మాత్రమే ఉన్నాయని, ఇతర సమస్యలు ఏమీ లేవని చెప్పారు. ఇవాళ తనను కలిసిన వారంతా క్వారంటైన్లో ఉండాలని, కొవిడ్ పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. ఇవాళ కేంద్రమంత్రులు నిత్యానందరాయ్, భారతీ ప్రవీణ్ పవార్, టీఎంసీ ఎంపీ మిమి చక్రవర్తి బారినపడ్డ విషయం తెలిసిందే.
आज शाम मैंने अपना कोविड टेस्ट करवाया जो पॉजिटिव आया है। मेरे बेहद हल्के लक्षण हैं एवं कोई अन्य परेशानी नहीं है। आज मेरे संपर्क में आए सभी लोगों से निवेदन है कि वे स्वयं को आइसोलेट कर लें एवं अपना कोविड टेस्ट अवश्य करवाएं।
— Ashok Gehlot (@ashokgehlot51) January 6, 2022