BJP | గల్లీకో గురుద్వారానా?.. కూల్చిపారేయాలి.. రాజస్థాన్ బీజేపీ నేత వివాదాస్పద వ్యాఖ్యలు
గురుద్వారాలను కూల్చిపారేయాలంటూ ఓ బీజేపీ నేత చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. రాజస్థాన్లోని తిజారాలో జరిగిన ప్రచార సభలో యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ పాల్గొన్నారు.
BJP | హైదరాబాద్(స్పెషల్ టాస్క్ బ్యూరో, నమస్తే తెలంగాణ): గురుద్వారాలను కూల్చిపారేయాలంటూ ఓ బీజేపీ నేత చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. రాజస్థాన్లోని తిజారాలో జరిగిన ప్రచార సభలో యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ పాల్గొన్నారు. ఈ సభలో బీజేపీ మాజీ ఎమ్మెల్యే సందీప్ దాయ్మా మాట్లాడుతూ తిజారాలో ఎక్కడ పడితే అక్కడ గురుద్వారాలు కట్టారని, అవి మనకు భవిష్యత్తులో నష్టదాయకంగా మారతాయని, వాటిని కూల్చిపారేయాలంటూ ప్రజలకు పిలుపునిచ్చారు.
అది మన బాధ్యతని నొక్కి చెప్పారు. దీనికి యోగి కూడా చప్పట్లు కొట్టారు. సందీప్ వ్యాఖ్యలపై సిక్కులు ఆగ్రహం వ్యక్తంచేశారు. ఆయన దిష్టి బొమ్మలను దహనం చేశారు. దీంతో సందీప్ క్షమాపణలు చెప్పారు. గురుద్వారాకు వెళ్లి క్షమాపణ పత్రం రాసిచ్చారు. శిరోమణి గురుద్వారా కమిటీ నిర్ణయం మేరకు ఏ శిక్షకైనా సిధ్ధమన్నారు. సంజయ్ రాసిచ్చిన క్షమాపణ పత్రాన్ని అమృత్సర్ అకల్ తఖ్త్ కమిటీకి పంపుతామని స్థానిక గురుద్వారా నిర్వహణ కమిటీ ప్రకటించింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

