ఆదివారం 31 మే 2020
National - May 12, 2020 , 13:50:18

54వేల మందికి టికెట్లు.. ఆరోగ్య‌సేతు యాప్ త‌ప్ప‌నిస‌రి

54వేల మందికి టికెట్లు.. ఆరోగ్య‌సేతు యాప్ త‌ప్ప‌నిస‌రి


హైద‌రాబాద్‌: లాక్‌డౌన్ వేళ భార‌తీయ రైల్వే ప్ర‌త్యేక రైళ్ల‌ను ఏర్పాటు చేసిన విష‌యం తెలిసిందే.  ఇవాళ సాయంత్రం నుంచి ఆ రైళ్లు న‌డ‌వ‌నున్నాయి. మొత్తం 15 రైళ్ల కోసం సోమ‌వారం సాయంత్రం 4 గంట‌ల‌కు ఐఆర్సీటీసీ ద్వారా బుకింగ్ అవ‌కాశం క‌ల్పించారు. అయితే సోమ‌వారం ఒక్క రోజే ఆ ప్ర‌త్యేక ఏసీ రైళ్ల కోసం 54వేల మందికి టికెట్లు జారీ చేసిన‌ట్లు భార‌తీయ రైల్వే పేర్కొన్న‌ది. నిన్న రాత్రి 9.15 నిమిషాల వ‌ర‌కు సుమారు 30 వేల పీఎన్ఆర్‌లు జ‌న‌రేట్ చేసిన‌ట్లు అధికారులు వెల్ల‌డించారు.  మొత్తం మీద 54 వేల మంది ప్ర‌యాణికుల‌కు టికెట్లు ఇచ్చారు. ప్ర‌త్యేక ఏసీ రైళ్ల‌తో పాటు ఇప్ప‌టికే వంద‌ల సంఖ్య‌లో శ్రామిక్ రైళ్ల‌ను కూడా రైల్వేశాఖ న‌డుపుతున్న విష‌యం తెలిసిందే. ప్ర‌త్యేక ఏసీ రైళ్ల కోసం ఆర్ఏసీ కానీ, వెయిటింగ్ లిస్టు కానీ ఇవ్వ‌లేదు.  ప్ర‌యాణికులు త‌మకు కావాల్సిన ఆహారాన్ని తెచ్చుకోవాలి. ప్ర‌త్యేక రైళ్ల‌లో వెళ్తున్న ప్ర‌యాణికులంద‌రూ త‌మ మొబైల్ ఫోన్ల‌లో ఆరోగ్య సేత‌ను యాప్‌ను త‌ప్ప‌నిస‌రిగా డౌన్‌లోడ్ చేసుకోవాలి. logo