న్యూఢిల్లీ, డిసెంబర్ 30 : ‘రైల్ వన్ యాప్’తో కొనుగోలు చేసే అన్రిజర్వ్డ్ టికెట్స్‌పై 3 శాతం డిస్కౌంట్‌ను ఆఫర్ చేస్తున్నట్టు భారతీయ రైల్వే ప్రకటించింది. 2026 జనవరి 14 నుంచి 2026 జూలై 14 వరకు ‘రైల్ వన్ యాప్’ నుంచి డిజిటల్ చెల్లింపులకు ఈ ఆఫర్ వర్తిస్తుందని రైల్వే మంత్రిత్వ శాఖ సోమవారం ఒక ప్రకటనలో తెలిపింది.
ప్రస్తుతం ఈ యాప్‌లో టికెట్స్ కొనుగోలుపై 3 శాతం క్యాష్‌బ్యాక్ ఇస్తున్నారు. డిజిటల్ చెల్లింపులపై అదనంగా 3 శాతం డిస్కౌంట్ ఇవ్వాలని నిర్ణయించినట్టు రైల్వే శాఖ తెలిపింది.