న్యూఢిల్లీ: ప్రముఖ రైల్వే టికెట్ల ప్లాట్ఫామ్ ఐఆర్సీటీసీ సేవల్లో తీవ్ర అంతరాయాలు ఎదురయ్యాయి. దీని వల్ల దీపావళి, ఛఠ్ పూజ ప్రయాణాల సీజన్ వేళ వేలాది యూజర్లు ఆన్లైన్లో రైలు టికెట్లు బుక్ చేసుకోలేక తీవ్ర ఇబ్బందులు పడ్డారు.
ఐఆర్సీటీసీ వెబ్సైట్, మొబైల్ యాప్లో సాంకేతిక సమస్య వల్ల ఈ అంతరాయం తలెత్తిందని అధికారులు తెలిపారు. టికెట్లు బుక్ చేసుకోలేకపోయామని 5 వేల మందికి పైగా యూజర్లు సామాజిక మాధ్యమాల్లో తమ అసంతృప్తిని వెళ్లగక్కారు.