న్యూఢిల్లీ: పండుగల సమయాల్లో టిక్కెట్ లేకుండా రైళ్లలో ప్రయాణించేవారిని నిరోధించేందుకు రైల్వే శాఖ సమాయత్తమవుతున్నది. టిక్కెట్ లేకుండా ప్రయాణించే పోలీసులపై కూడా చర్యలకు సిద్ధమవుతున్నది. రైల్వే శాఖ ఈ నెల 20న దేశంలోని 17 జోన్ల జనరల్ మేనేజర్లకు రాసిన లేఖలో దీనికి సంబంధించిన ఆదేశాలను జారీ చేసింది. టిక్కెట్ లేకుండా, అనధికారికంగా రైళ్లలో ప్రయాణించేవారిపై రైల్వే చట్టం, 1989 ప్రకారం చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. దీని కోసం వచ్చే నెల 1 నుంచి 15 వరకు, వచ్చే నెల 25 నుంచి నవంబరు 10 వరకు ప్రత్యేక తనిఖీలను నిర్వహించాలని చెప్పింది. టిక్కెట్ లేని ప్రయాణికుల్ని గుర్తించి చర్యలు తీసుకుంటున్నట్టు తెలిపింది.