న్యూఢిల్లీ: రైల్వేలో కాగితం వినియోగం సగానికి తగ్గింది. ప్రయాణికులు టికెట్ బుకింగ్‌కు ఎక్కువగా ఆన్‌లైన్‌కు మొగ్గుచూపడం దీనికి కారణంగా తెలుస్తున్నది. 2018లో 22,685 రీమ్‌ల పేపర్‌ను వినియోగించగా 2021లో కాగిత వినియోగం 10,272 రీమ్‌లకు తగ్గిందని రైల్వే మంత్రిత్వ శాఖ నివేదిక పేర్కొంది. ఈ నేపథ్యంలో కాగితం ప్రిటింగ్‌కు అయ్యే ఖర్చు కూడా భారీగానే తగ్గిందని కేంద్ర ప్రభుత్వం పరిధిలోని పరిపాలనా సంస్కరణలు, ప్రజా ఫిర్యాదుల విభాగం (డీఏఆర్పీజీ) తెలిపింది. 2019-20లో కాట్రిడ్జ్ల ఖర్చు రూ. 1.3 కోట్లతో పోలిస్తే 2022 మార్చి నాటికి కాట్రిడ్జ్ల ఖర్చు రూ.50 లక్షలు మేరకు తగ్గుతుందని అంచనా వేసింది.
మరోవైపు, మంత్రిత్వ శాఖలు ఈ-ఆఫీస్ వెర్షన్ 5.6 నుంచి వెర్షన్ 6.0కి అప్‌గ్రేడ్ అయ్యాయని డీఏఆర్పీజీ తెలిపింది. అనేక మంత్రిత్వ శాఖలు ఈ-ఆఫీస్ వెర్షన్ 7.0కు అప్‌గ్రేడ్ అయినట్లు పేర్కొంది. MelTY, DARPG, టెలికాం, పోస్టల్ వంటివి ఈ-ఆఫీస్ వెర్షన్ 7.0కి మారిన మంత్రిత్వ శాఖలలో ఉన్నాయని వెల్లడించింది. ఎన్ఐసీ ద్వారా వెర్షన్ రోల్-అవుట్ ప్లాన్ రూపొందించినట్లు వివరించింది.