IRCTC | ఐఆర్సీటీసీ లో సాంకేతిక సమస్య.. నిలిచిన టికెట్ బుకింగ్ సేవలు
IRCTC | రైల్వే శాఖకు చెందిన ఐఆర్సీటీసీ (IRCTC)లో సాంకేతిక సమస్య తలెత్తింది. IRCTC వెబ్ సైట్, యాప్ సేవల్లో అంతరాయం ఏర్పడింది. దీంతో ఆన్ లైన్ లో టికెట్ బుకింగ్ సేవలు నిలిచిపోయాయి. ఈ విషయాన్ని ఐఆర్సీటీసీ ట్విట్టర్ ద్వారా వెల్లడించింది.
IRCTC | రైల్వే శాఖకు చెందిన ఐఆర్సీటీసీ (IRCTC)లో సాంకేతిక సమస్య తలెత్తింది. IRCTC వెబ్ సైట్, యాప్ సేవల్లో అంతరాయం ఏర్పడింది. దీంతో ఆన్ లైన్ లో టికెట్ బుకింగ్ సేవలు నిలిచిపోయాయి. ఈ విషయాన్ని ఐఆర్సీటీసీ ట్విట్టర్ ద్వారా వెల్లడించింది. టికెట్ కొనుగోలు విషయంలో యాప్, వెబ్ లో సాంకేతిక సమస్యలు తలెత్తినట్లు పేర్కొంది. దీంతో టికెట్ బుకింగ్ సేవలు (ticket booking services) అందుబాటులో లేవని తెలిపింది. సమస్యను పరిష్కరించేందుకు టెక్నికల్ టీమ్ ప్రయత్నాలు చేస్తోందని పేర్కొంది.
అప్పటి వరకూ ప్రత్యామ్నాయ మార్గాలైన మేక్మైట్రిప్ (MakeMyTrip), అమెజాన్ (Amazon) వంటి ఆన్లైన్ ట్రావెల్ ఏజెన్సీల ద్వారా టికెట్లు బుక్ చేసుకోవచ్చని సూచించింది. IRCTC వెబ్ పోర్టల్, యాప్‌లోని సేవలు ఉదయం 8 గంటల నుండి నిలిచిపోయినట్లు తెలుస్తోంది. అయితే, ప్రత్యామ్నాయ మార్గాల్లో కూడా టికెట్లు బుక్ అవ్వట్లేదని పలువురు కామెంట్స్ చేస్తున్నారు.
Due to technical reasons, the ticketing service is not available on IRCTC site and App. Technical team of CRIS is resolving the issue.
Alternatively tickets can be booked through other B2C players like Amazon, Makemytrip etc.
— IRCTC (@IRCTCofficial) July 25, 2023
Also Read..
Devendra Fadnavis | త్వరలో మహా సీఎంగా అజిత్ పవార్..? క్లారిటీ ఇచ్చిన ఫడ్నవీస్
Manipur violence | మణిపూర్ అమానవీయ ఘటన.. మరో నిందితుడి అరెస్ట్
Manipur | మణిపూర్ పై ఆరని మంటలు.. పార్లమెంట్ ఆవరణలో రాత్రంతా విపక్ష ఎంపీల నిరసన దీక్ష
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Watch: గర్బా వేడుక నుంచి బాలికను బయటకు నెట్టిన బీజేపీ నేత.. తర్వాత ఏం జరిగిందంటే?
Jio IPO | జియో ఐపీవోకు చరిత్రలోనే రికార్డు స్థాయి స్పందన.. యాంకర్ బుక్‌లో రూ.2.5 లక్షల కోట్ల బిడ్లు!
Bloody Romeo | నాని బ్లడీ రోమియో షూటింగ్ షురూ.. ఇంతకీ లొకేషన్ ఎక్కడో తెలుసా..?
Tanzania | టాంజానియాలో టీసీఏ ఆధ్వర్యంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
Bathukamma Celebrations | దక్షిణాఫ్రికాలో ఘనంగా సద్దుల బతుకమ్మ సంబరాలు
ట్రెండింగ్ వార్తలు
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

